2024 ఎలక్షన్లో దొంగ ఓట్లతో మళ్లీ అధికారం కోసం వైసిపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, అదే విధంగా తిరుపతి జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున దొంగ ఓట్లను చేర్పించారని టిడిపి నాయకులు ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఇసుక , మఠం భూములు ,ఎర్రచందనం మాఫియా లాగా అధికారుల అండదండలతో దొంగ ఓట్ల మాఫియా చేశారని ఆరోపించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు సుగుణమ్మ, పులివర్తి నాని, నరసింహా యాదవ్ తో కలిసి దొంగ ఓట్లు పైన ఫిర్యాదు చేశారు .ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ రానున్న ఎలక్షన్ లో వైసీపీ దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు .ఇప్పటికైనా అధికారులు దొంగ ఓట్ల పైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు
Tag:
Stolen votes
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా చంద్రగిరి గుర్తింపు పొందింది చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్ల కలకలం రేగింది. నియోజకవర్గం పరిధిలో దాదాపు 35 వేల దొంగ ఓట్లను చంద్రగిరి టిడిపి ఇంచార్జీ పులివర్తి నాని గుర్తించారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి తిరుపతి తాసిల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నకిలీ ఫాం 6 ను అప్లై చేసిన వారిని వెంటనే శిక్షించాలంటూ నినాదాలు చేశారు. గుర్తించిన దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని పులివర్తి నాని డిమాండ్ చేశారు.





Total views : 78387