నంద్యాల పద్మావతి నగర్ లో జనసేన కార్యాలయంను టిడిపి అభ్యర్థి ఫరూఖ్, మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎవి సుబ్బారెడ్డి, న్యాయవాది తులసి రెడ్డి లు ప్రారంభించి జనసేన జెండాను ఆవిష్కరించారు. జనసేన కన్వీనర్ విశ్వనాథ్, సుధాకర్ లు మాట్లాడుతూ సేవ కోసమే మా నాయకుడు ప్రజల్లోకి వచ్చాడనీ,తన సొంతంగా కష్టపడి తాను తీసిన సినిమాలు నుంచి వచ్చే డబ్బుతోనే నేటి వరకు కూడా పార్టీ కార్యక్రమాలు నడిపిస్తూ ప్రమాదాలలో మరణిస్తున్న కార్యకర్తలకు గాని ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గాని తన సొంత డబ్బులు వెచ్చించుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. కేవలం ప్రజలకు జరుగుతున్న అన్యాయం ప్రజల్లో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఉన్మాదైనా జగన్మోహన్ రెడ్డిని ప్రజల జీవితాలు బాగుపడడం కోసం గద్దె దింపడానికి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న సీనియర్ నాయకుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని గెలుపే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో నంద్యాల ఉమ్మడి అభ్యర్థి ఫరూక్ గెలుపుకు కృషి చేయాలని జనసేన నాయకులకు ,కార్యకర్తలకు పిలుపునిచ్చి రాబోయే ఎన్నికల్లో గెలుపు సాధించి ప్రజలకు అన్ని రకాలుగా మంచి చేకూర్చేయాలా చూడాలని ఈరోజు టిడిపితో పొత్తు పెట్టుకోవడం జరిగిందని అన్నారు.
TDP Jana Sena alliance
CVR News Special Article :
ఏపీలో పోటీ ఎలా అన్న విషయాన్ని బీజేపీ ఎట్టకేలకు తేల్చింది. చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లుగా పాత ఎన్డీఏ గ్రూపు మళ్లీ పోటీ చేయబోతోంది. తెలుగుదేశం – జనసేన కలిసి నడవాలని చాన్నాళ్ల క్రితమే నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పి అభ్యర్థులను కూడా అనౌన్స్ చేశారు. ఇన్నాళ్లు ఏ విషయం తేల్చకుండా వస్తూ ఉన్న బీజేపీ ఎట్టకేలకు కూటమిలో కలిసేందుకు ఓకే చెప్పింది. పొత్తులపై శనివారం ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ విబేధించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్టీఏ నుంచి బయటకు వచ్చారు. పవన్ కళ్యాణ్ తోనూ దూరం పెరగడం తో టీడీపీ అప్పుడు ఒంటరిగా పోటీ చేసింది. ఓట్ల చీలిక వల్ల నష్టపోయామని గుర్తించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసిపోయారు. కేంద్రం లో బలంగా ఉన్న బీజేపీతో గొడవ మంచిది కాదని గుర్తించి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. గడచిన ఐదేళ్లలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. రెండు మూడుసార్లు పార్టీ అధినాయకత్వాన్ని కూడా కలిశారు. కలిసి పోటీ చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన తెలుగుదేశం – జనసేన ఇప్పటికే కలిసి నడుస్తున్నాయి. బీజేపీని కూడా కూటమిలో చేర్చేందుకు పవన్ కల్యాణ్ తన వంతు ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లుగా ఏ విషయం తేల్చకుండా వస్తున్న బీజేపీ ఎట్టకేలకు కూటమిలో చేరేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్టీఏలోకి చేరుతున్న విషయాన్ని బీజేపీ శనివారం అధికారికంగా వెల్లడించనున్నారు అంట.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఎన్డీలోకి తెలుగుదేశం చేరిక విషయాన్ని ప్రకటించిన వెంటనే చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. మార్చి 4 వ తేదీన సీట్ల ప్రకటన చేసేందుకు రంగం సిద్దం చేసారు. ఇప్పటికే జనసేన – టీడీపీ కూటమి 99 సీట్లను అనౌన్స్ చేసేశాయి, బీజేపీ వైపు నుంచి చాలా రోజులు కదలిక లేక పోవడంతో టీడీపీ – జనసేన దూకుడుగా వ్యవహరించాయి. ఒకేసారి టీడీపీ 94, జనసేన 5 సీట్లను ప్రకటించేశాయి. జనసేనకు మొత్తం 24 సీట్లను కేటాయించగా.. ఐదు పేర్లను ప్రకటించారు. అంటే మిగిలిన స్థానాల్లో 19 చోట్ల జనసేన పోటీ చేయనుంది. ఆ పైన మిగిలన వాటిని టీడీపీ – బీజేపే పంచుకోవాలి.
బీజేపీ ప్రధాన లక్ష్యం లోక్ సభ ఎన్నికలు కాబట్టి వారి ఫోకస్ వాటి పైనే ఉంది. పొత్తులపై ప్రకటన ఇంకా రానప్పటికీ సీట్ల సంఖ్య, కేటాయింపు విషయంలో బీజేపీ – టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ 5 లోక్ సభ, 9 అసెంబ్లీ సీట్లను కోరగా, 3 లోక్ సభ, 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు సిద్దం అయినట్లు సమాచారం. అరకు, తిరుపతి, హిందూపురం, కర్నూలు, రాజమండ్రి లేదా ఏలూరు పార్లమెంట్ స్థానాలను బీజేపీకి కేటాయించాలని కోరగా వాటిలో 3 పార్లమెంట్ స్థానాలను కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. మరో పక్క అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే.. శ్రీకాకుళం, విశాఖ ఉత్తరం, మాడుగుల, నర్సాపురం, ధర్మవరం, జమ్మలమడుగు, మదనపల్లి, తిరుపతి, పాడేరు, కైకలూరు, నర్సరావుపేట 9 స్థానాలను బీజేపీ కేటాయించాలని కోరగా వాటిలో ఒక 6 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు సూత్ర ప్రాయంగా అంగీకారం కుదిరింది అనేది సంచారం.
మొత్తంగా మార్చ్ మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున వీలైనంత తొందరగా అభ్యర్థులను కూడా ప్రకటించేసి ఎన్నికల పోరాటంలోకి దూకేయాలని మూడు పార్టీలు అనుకుంటున్నాయి. ఎండాకాలం రాకముందే ఎన్నికల రాజకీయ వాతావరణంతో ఏపి లో రాజకీయ వేడి మొదలయింది. రాబోయే 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడతారో వేచి చూడాలి మరి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శ్రీకాకుళంలో జరిగిన రా కదలిరా సభలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని తెదేపా జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ అన్నారు. జగన్మోహన్ రెడ్డిలా ఆర్టీసీ బస్సులు పెట్టి మందు, బిర్యానీ, డబ్బులు ఇచ్చి తెచ్చిన ప్రజలు కారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పైన, నాయకత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో చెప్పడానికి నిదర్శనం నిన్న విజయవంతం అయిన రా కదలి రా సభ అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు, వైసీపీ దౌర్జన్యాలకు క్రీడారంగం కూడా గురైందన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టి క్రీడాకారులకు నాసిరకం క్రీడా వస్తువులు ఇచ్చారని దుయ్యబట్టారు. ఆంధ్ర క్రికెట్ జట్టులో 17వ ఆటగాడి కోసం వైసీపీ నాయకుల ప్రోత్బలంతో జట్టు నాయకుడు, భారత జట్టు టెస్ట్ ఆటగాడు హనుమ విహారిణి ఆంధ్ర జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడం దారుణమని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాలను నాశనం చేశాడని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల పరిణామాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మొదటి జాబితా సీట్ల ఎంపిక విషయంలో కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలు తీసుకునే నిర్ణయంపై అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటు టీడీపీ అటు జనసేన అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బలంగా ఉండడంతో కచ్చితంగా అవకాశం మాకే వస్తుందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పితాని బాలకృష్ణ, టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కచ్చితంగా తనకు అవకాశం కల్పిస్తారని జనసేన పిఎసి సభ్యుడు బాలకృష్ణ అంటున్నారు.





Total views : 198271