చేసిన పాపాలు పోవాలని, సన్మార్గంలో నడిచేలా దీవించాలని భక్తులంతా శ్రీకాళహస్తీశ్వర స్వామిని వేడుకుంటారు. అధికారమదం తలకెక్కిన వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాత్రం శ్రీకాళహస్తి సన్నిధిలోనే పాపాలకు పాల్పడుతున్నాడు. స్వామి, అమ్మవార్లకే అపచారం తలపెడుతున్నాడు. పురాతన శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకి నైవేద్యాలు తయారుచేసే గది, మృత్యుంజయ పూజలు నిర్వహించే ప్రదేశంలో వేల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాలను కూల్చేయిస్తున్నాడు. పురావస్తు, దేవాదాయ శాఖ నిబంధనలు పట్టించుకోకుండా, వీఐపీల ఆశీర్వాదాల కోసం శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. చారిత్రక, పురావస్తు, ఆధ్యాత్మిక సంపద ధ్వంసం చేయడం నిబంధనలకు విరుద్ధమే కాదు, పాపం. శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని టిడిపి పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.
Tdp
సీఎం జగన్ రాష్ట్రంలోని ఉద్యోగులను అవహేళన చేస్తున్నారని ఏలూరు టిడిపి ఇంచార్జ్ బడేటి చంటి అన్నారు.. ఏలూరు కలెక్టరేట్ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు గత 13 రోజులు గా సమ్మె చేస్తున్నారు. ఈరోజు ఈ సమ్మెలో ఏలూరు టీడీపీ ఇన్చార్జ్ బడేటి చంటి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జోకర్ పాలన సాగుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి చదువు లేని వ్యక్తి.. చదువుకున్న ఉద్యోగుల బాధ ఆయనకు తెలియదని విమర్శించారు. ప్రతిసారి ఉద్యోగులను చర్చలు పేరుతో పిలిచి అవమానపరుస్తున్నారని ఆయన ఆరోపించారు.
Read Also..
కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గానికి ఓ ప్రాధాన్యత ఉంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా శాసనసభ మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు గెలిచారు. రెండుసార్లు వైసిపి నేత, ప్రస్తుత రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు. దీంతో ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత చేకూరింది. యనమల రామకృష్ణుడి వయసు మీరడంతో తన వారసురాలిగా తన కుమార్తె దివ్య ను రంగంలోకి దింపారు. ఆయనకు కుమారులు లేరు. దీంతో వారసత్వాన్ని కుమార్తె దివ్యకు అప్పగించేందుకు పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించారు. దివ్యను ఇంఛార్జి గా ప్రకటించారు. దీంతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ మొదలైంది, రోడ్డున పడ్డారు. చంద్రబాబు జోక్యం చేసుకుని ఇద్దరినీ కలిపారు. కృష్ణుడు కి మంచి భవిష్యత్తును ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇంతకాలం నివురు కప్పిన నిప్పులా వ్యవహారం నడిచింది. ఒకటో తేదీ నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా మరోసారి అన్నదమ్ముల వివాదాలు బయటపడ్డాయి. రోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లలో ఆందోళన మొదలైంది. అన్నదమ్ముల మధ్య ఇలా ఘర్షణ జరిగితే ఈ సీటు వైసిపి ఖాతాలోకి పోవడం ఖాయమని సీనియర్ కార్యకర్తలు వాబోతున్నారు. ఎలాంటి పదవులు లేవు, అన్నదమ్ములు, కుమార్తె వీరికే పదవులా, వీటికోసం కొట్టుకుంటారా, పార్టీని పట్టించుకోరా అంటూ నిలదీస్తున్నారు.
Read Also..
శెట్టిపల్లి గ్రామంలో టీడీపీ సర్పంచ్ రీటా ఎల్లప్పకి చెందిన జెసిబి అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో జరిగింది. చంద్రబాబు నాయుడు పర్యటనలో చురుగ్గా పాల్గొన్న సర్పంచ్.. కావాలనే తన జెసిబి అద్దాలను పగులగొట్టారని సర్పంచ్ రీటా ఎల్లప్ప పేర్కొన్నారు. పోలీసులకు పిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.
గత 21 రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఈరోజు ప్రతివారు ఆఫీసుల్లో ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మాత్రం రోడ్లపై కూర్చొని భిక్షాటన చేస్తున్నారని, వారు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు బాపట్ల తెలుగుదేశం పార్టీ నాయకుడు మాడా సుబ్రహ్మణ్యం దాతృత్వంతో అంగన్వాడీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారికి సంఘీభావం తెలిపి, వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. నూతన సంవత్సర సందర్భంగా వారికి మంచి రుచికరమైన బిర్యాని తానే స్వయంగా వడ్డించి అంగన్వాడి బాధలను నేను చూస్తూ ఉన్నానని, ఇకనైనా ఈ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిచి మీ డిమాండ్లు నెరవేర్చాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని మాడా సుబ్రమణ్యం అన్నారు.
గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని పలుచోట్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఎర్రగడ్డ వెంకట్రావు నివాళులర్పించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీతో గన్నవరంలోనీ గాంధీ బొమ్మ సెంటర్ నుండి పార్టీ కార్యాలయం వద్దకు ఊరేగింపుగా వచ్చి నూతన సంవత్సర కేకు కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ వెంకట్రావు తో పాటు జనసేన గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, జిల్లా జాయింట్ సెక్రెటరీ చిమట రవి వర్మ, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన జనసేన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి, జై తెలుగుదేశం జై యార్ల గడ్డ గన్నవరం నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అంటూ నినాదాలు చేశారు.
Read Also..
తెలుగు ప్రజలకు వందనం!అభివందనం!!
కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం ఆనవాయితీ. గతించిన కాలం దుర్భరంగా ఉన్నప్పుడు ఆ చేదు జ్ఞాపకాలు త్వరగా మరచిపోవాలని, అలాంటి రోజులు మళ్లీ వెంటాడకుండా జాగ్రత్త పడాలని, మంచి రోజుల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని నూతన సంవత్సర ఆరంభంలో సంకల్పిస్తాం.
నాలుగున్నరేళ్ళ నరకానికి పరాకాష్ఠ ను 2023 లో ప్రత్యక్షంగా అనుభవించాం, భరించాం.”ఒక్క అవకాశం” అని ప్రాధేయపడితే నమ్మి, అర్హత లేని వారిని అందలమెక్కిస్తే జరిగిన నష్టాన్ని మనమందరం కళ్ళారా చూశాం. అందుకే ఒక కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. నూతన సంవత్సరంలో హింసకు, అవినీతికి, అశాంతికి, అక్రమాలకు, అమానుషానికి తావులేని ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పటిష్టమైన పునాదులు వేద్దామని ప్రతిన పూనుదాం. శతాధిక తప్పిదాల శిశుపాలుడిని 2024 లో ఓటు అనే సుదర్శన చక్రం ప్రయోగించి సాగనంపేందుకు తెలుగు సోదర, సోదరీమణులు సిద్ధం కండి. ప్రతి తెలుగువాడిని నిపుణతగల విశ్వమానవుడిగా తీర్చిదిద్దే బృహత్కార్యానికి నాంది పలుకుదాం. విశ్వ వినువీధుల్లో తెలుగుజాతి జయపతాక రెపరెపలాడిద్దాం. భరతజాతి సమృద్ధికి మనవంతు చేయూతనిద్దాం.
సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలపైన సాగే సుపరిపాలన కోసం, పేదరికంలేని సమాజ నిర్మాణం కోసం మనం సమగ్ర పథక రచన చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇందులో భాగంగా ఆరు గ్యారెంటీలతో తొలివిడత మ్యానిఫెస్టో విడుదల చేశాము. మలివిడతగా ‘తెలుగు దేశం’, ‘జనసేన’ కలిసి రాష్ట్ర దశ, దిశ మార్చివేసే సమగ్ర మ్యానిఫెస్టోను త్వరలోనే ప్రకటించబోతున్నాం.
నూతన సంవత్సరంలో మరో నూరు రోజుల్లో ఆటవిక పాలన నుండి తెలుగు ప్రజలకు విముక్తి కల్పిస్తానని హామీ ఇస్తున్నాను. తెలుగు జాతిని, తెలుగు ఖ్యాతిని ఏ శక్తి అడ్డుకోకుండా చూసే పూచీ నాది.
రండి! కలిసి రండి !! పేదరికానికి, అసమానతలకు తావులేని నవశకానికి నాంది పలుకుదాం !!
కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు, సిరిసంపదలు, శాంతి భద్రతలు, ఆయురారోగ్యాలు నింపాలని మనసారా కోరుకూంటూ.. శుభాకాంక్షలతో..
మీ
నారా చంద్రబాబు నాయుడు.
Read Also..
చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బాబును కలిసిన జనసేన నాయకులు తమ పార్టీ కండువా కప్పారు. గతంలో చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఇప్పటివరకు టీడీపీ కండువా లేకుండా ఇతర పార్టీ కండువాలు కప్పుకున్న దాఖలాలు లేవు. కానీ తొలిసారి జనసేన కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. కుప్పంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జనసేన ముఖ్య నాయకులతో సమావేశమైన సందర్భంలో తిరుపతికి చెందిన బత్తిన మధుబాబు., చంద్రబాబు మెడలో జనసేన కండువా వేసారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు జై జనసేన జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
చిత్తూరు జిల్లా.. నారా చంద్రబాబు నాయుడు మూడో రోజు కుప్పంలో పర్యటన వివరాలు.. ఉదయం 11 గంటలకు ప్రజలనుండి వినతి పత్రాలు స్వీకరించి, 12 గంటలకు పిఎస్ మెడికల్ కాలేజ్ వద్ద ఏర్పాటుచేసిన కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు కుప్పం ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ నందు నిరుపేదలకు భోజనాలు అందిస్తారు. కుప్పంలోని పెద్దపులి గంగమ్మ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కొత్తపేట పెద్ద మసీదులో మైనార్టీలతో కలిసి దువా లో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు కుప్పం మండలం మల్లానూరు బస్టాండ్ లో పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. పబ్లిక్ మీటింగ్ అనంతరం క్రిష్ణగిరి మీదుగా బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకుని, అక్కడి నుండి హైదరాబాదు చేరుకుంటారు.
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు కు చెందిన తెదేపా నేత చింతల అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి తిరుమల వరకు పాదయాత్రను ప్రారంభించారు. టిడిపి ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ 1200 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టడం చాలా ఆనందదాయకమని అన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన సాగుతోందని, అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి – జనసేన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందని పేర్కొన్నారు. పాదయాత్ర చేస్తున్న అశోక్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు ఉంది అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. ఎక్కడ చూసినా అరాచకాలు, వైసీపీ నాయకుల దాడులు చూస్తూనే ఉన్నామన్నారు. రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారన్నారు. రాష్ట్రంలో సామాన్యులు ప్రశాంతంగా బ్రతకాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాబోయే ఐదు సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రంను ప్రపంచ పటంలో చూపించగలరన్నారు.