ప్రపంచమంతా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది. ప్రపంచ వరల్డ్ కప్ లో వరుస విజయాలతో జోష్ లో ఉన్న టీమిండియా ఈరోజు జరిగే ప్రపంచ వరల్డ్ కప్ లో విజయం సాదించాలని ఆకాంక్షిస్తూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు తమదైన శైలిలో తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఏలూరుకు చెందిన మేతర సురేష్ అనే సూక్ష్మ కళాకారుడు ఒక చెక్కపై క్రికెట్ స్టేడియం ను తయారుచేసి అరంగులం అగ్గిపుల్లలపై భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్స్ ను చెక్కి, ఆస్ట్రేలియా క్రీడాకారులు ఫీల్డింగ్ చేస్తున్నట్టుగా, భారత్ క్రీడాకారులు బ్యాటింగ్ చేస్తున్నట్లు కళాకాండాలను తీర్చిదిద్దాడు. వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించి కప్పును కైవసం చేసుకుందని భావిస్తూ ఒకవైపు జాతీయ జెండాలను చెక్కి, మరోవైపు దోస గింజపై వరల్డ్ కప్ తయారుచేసి అబ్బురుపరిచారు.
Team India
ప్రపంచకప్ లో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లోను టీమ్ ఇండియా జయకేతనం ఎగరేసింది. ప్రపంచకప్ టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది. కీలక సెమీస్ పోరులో భారత్ న్యూజిలాండ్ ను 70 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీంతో గత వరల్డ్ కప్ సెమీస్ పరాజయానికి ఇప్పడు బదులు తీర్చుకున్నట్లైంది. అయితే వరుసగా మూడోసారి ఫైనల్ చేరుదామనుకున్న కివీస్ ఆశలు ఇసారి ఫలించలేదు. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ పరాజయంతో న్యూజిలాండ్ తన ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించింది. మహ్మద్ షమీ (7/57) వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. షమీ దెబ్బకు కివీస్ విలవిలలాడింది. బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసి భారత్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు.
వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో జోష్ మీదున్న మన క్రికెటర్లు దీపావళి వేడుకల్లోనూ అదే జోష్ చూపించారు. బెంగళూరులోని ఓ హోటల్ లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. టీమిండియా సభ్యులు అందరూ కలిసి ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. కెప్టెన్ రోహిత్ తన భార్య, కూతురుతో కలిసి పాల్గొన్నారు. ఇక విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క ఈ వేడుకల్లో సందడి చేశారు. ఆటగాళ్లంతా సంప్రదాయబద్ధంగా కుర్తీ, పైజామాలతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. లీగ్ దశలో చివరి మ్యాచ్ నెదర్లాండ్స్ తో భారత జట్టు తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది. దీంతో భారత జట్టు సభ్యులు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. శనివారం దీపావళి వేడుకలను హోటల్ లోనే ఘనంగా జరుపుకున్నారు. జట్టులోని ప్లేయర్లతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర టీంమెంబర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది. శ్రీలంక క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యం కనిపిస్తోందంటూ… లంక క్రికెట్ బోర్డును ఐసీసీ తన సభ్య దేశాల జాబితా నుంచి తొలగించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.ఓ సభ్య దేశంగా ఐసీసీ నియమావళిని శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్రస్థాయిలో ఉల్లంఘించిందని ఐసీసీ పేర్కొంది. ఐసీసీ సభ్య దేశాల క్రికెట్ బోర్డుల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యం ఉండరాదన్న నిబంధనను శ్రీలంక క్రికెట్ అతిక్రమించిందని వివరించింది. స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడంలో విఫలమైందని తెలిపింది. ఈ కారణంగానే శ్రీలంక క్రికెట్ బోర్డుపై వేటు వేస్తున్నట్టు ఐసీసీ స్పష్టం చేసింది. ఐసీసీ తాజా చర్యలకు బలమైన కారణమే ఉంది. వరల్డ్ కప్ టోర్నీలో శ్రీలంక జట్టు దారుణ ప్రదర్శన కనబర్చింది. 9 మ్యాచ్ లు ఆడి 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దాంతో టోర్నీ నుంచి ఎప్పుడో నిష్క్రమించింది. ముఖ్యంగా, టీమిండియా చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. ఆసియా కప్ ఫైనల్లో ఎలా కుప్పకూలిందో, వరల్డ్ కప్ లోనూ టీమిండియా బౌలర్ల ధాటికి కకావికలమైంది. దాంతో శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యలందరిపైనా ఆ దేశ క్రీడల మంత్రి రోషన్ రణసింఘే వేటు వేశారు. బోర్డు తాత్కాలిక పాలనాధ్యక్షుడిగా మాజీ సారథి అర్జున రణతుంగను నియమించారు. ఈ అంశమే ఐసీసీ ఆగ్రహానికి కారణమైంది.
దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంతో తెలుగు సీనియర్ నటుడు వెంకటేశ్ విరాట్ సెంచరీని సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ‘క్లాస్ ఇన్నింగ్స్. విరాట్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంతకుమించిన బర్త్డే సెలబ్రేషన్స్ ఉండవు’ అంటూ వెంకటేశ్ క్యాప్షన్ ఇచ్చారు.
వన్డే ప్రపంచకప్లో భారత్ వరుసగా 8 విజయాలను నమోదు చేసింది. దక్షిణాఫ్రికాను 243 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమ్ఇండియా 16 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తొలుత భారత్ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో అలరించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా ఐదు వికెట్ల ప్రదర్శనతో సఫారీ జట్టును కుప్పకూల్చాడు.
వన్డే ప్రపంచకప్ లో సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించిన టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ స్పష్టం చేసింది. మొదట అతడు సెమీఫైనల్స్ నాటికి కోలుకుంటాడని అంతా భావించారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు కోలుకోవడం కష్టంగా మారింది. దాంతో మిగిలిన టోర్నీకి హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండబోవడం లేదని ఐసీసీకి బీసీసీఐ తెలియజేసింది. హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రసిధ్ కృష్ణ భారత జట్టుతో కలవనున్నాడు. ఈ విషయాన్ని కూడా ఐసీసీ స్పష్టం చేసింది.






Total views : 91152