అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన ప్రజలు. పని చేయాలంటే లంచం అడుగుతున్న ఎలక్ట్రికల్ ఏ.ఈ. ఎం.నాగేశ్వరరావు. వినియోగదారుల నుండి అధిక మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్న ఏ.ఈ. మీటర్ గురించి అప్లై చేసిన వినియోగదారుడు ను 40వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడంటూ ప్రజల ఆరోపణ. ఎక్కడికి వెళ్లినా నన్ను ఏమి చేయలేరని ఏ.ఈ. నాగేశ్వరరావు ధైర్యం. సబ్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ప్రజలు.
technology news
జగ్గయ్యపేట జాతీయ రహదారి భీమవరం టోల్ ప్లాజా వద్ద అంగన్వాడీలను అడ్డుకుంటున్న పోలీసులు. విజయవాడ కలెక్టరేట్ వద్ద బైటాయింపు కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడి మహిళలను నిలిపివేస్తున్న పోలీసులు. మా హక్కుల సాధన కోసo వెళ్తుంటే ఆపడం ఏంటని అడుగుతున్న అంగన్ వాడీలు. మహిళలని చూడకుండా పోలీసులు అసభ్యంగా మాట్లాడుతున్నారని అంగన్వాడి సభ్యులు మండిపడుతున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్షా విరమణలు. ఐదు రోజులపాటు కొనసాగనున్న భవానీ దీక్షా విరమణ కార్యక్రమం. నాలుగు హోమగుండాలని వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసిన ఆలయ అధికారులు అర్చక స్వాములు. నేతి టెంకాయలను సమర్పించి భవానీ దీక్షలను విరమణ చేస్తున్న భవానీ భక్తులు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. కనుచూపుమేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటెత్తిన భవానీ భక్తులు. ప్రత్యేక కౌంటర్లలో ఇరుముడులను సమర్పిస్తున్న భవానీలు. మూడు షిఫ్ట్ లలో 300 మంది గురు భవానీలు. కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. 20 లక్షల లడ్డూలను భవానీలకు అందుబాటులో ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. గిరి ప్రదక్షణలో భవానీ భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణుకు సెంట్రల్ నియోజకవర్గం సీటును కేటాయించకపోవడంతో ఒక్కసారిగా భారీ సంఖ్యలో మల్లాది విష్ణు నివాసానికి చేరుకున్న వైసీపీ శ్రేణులు మల్లాది విష్ణు అభిమానులు. ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గం సీటు మల్లాది విష్ణు కు కేటాయించాలని కోరుతూ రోడ్డుపై భారీగా చేరుకున్న ప్రజలు. మల్లాది విష్ణు కే సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ భారీ ఎత్తున నినాదాలు చేస్తున్న వైసీపీ శ్రేణులు మల్లాది అభిమానులు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, 53 మద్యం సీసాలను, 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకున్న గన్నవరం పోలీసులు. సాధారణ తనిఖీలలో భాగంగా గన్నవరం మండలం కేసరపల్లి- సవారిగూడెం జంక్షన్ వద్ద వాహనాలు చెకింగ్ లో భాగంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు. వారి వద్ద నుండి 53 మద్యం సీసాలను 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గన్నవరం పోలీసులు.
ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో పురుగుమందు సేవించి తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కి చెందిన కొప్పుల విజయభారతి (35), కొప్పుల శ్రీనిధి (13)గా గుర్తింపు. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలింపు. పురుగుమందు సేవించిన తల్లీకూతుళ్ల ఆరోగ్యం పరిస్థితి విషమం. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ రోజుల్లో ప్రజలు తమ సులభమైన పనుల కోసం ఈ అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు అన్ని రకాల లావాదేవీలూ కరెన్సీ నోట్ల ద్వారా జరిగేవి. ఆ తర్వాత ATM కార్డులు వచ్చాయి. ఆ తర్వాత Paytm, Phonepe, Google Pay మార్కెట్లోకి ప్రవేశించాయి. ఇప్పుడు స్మార్ట్ రింగ్ అదే తరహాలో వచ్చింది. కాబట్టి ఇకపై ATM కార్డ్, Paytm, Phonepe వంటివి అవసరం లేదు. వాటికి బదులుగా చేతికి ఉంగరం ఉంటే చాలు. మరి ఆ ఉంగరం ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా చాలా మంది తమ చేతికి ఉంగరం ధరిస్తారు. అయితే ఇప్పుడు అదే రింగ్ స్మార్ట్ టూల్‌గా మారింది. చేతిలో ఉంగరంతో నగదు రహిత చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని ఇక నుంచి పొందవచ్చు. దీన్ని స్మార్ట్ రింగ్ అంటారు. ఎలాంటి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లు లేకుండా, Paytm లేదా ఫోన్ కాల్స్ అవసరం లేకుండా ఈ రింగ్‌తో చెల్లింపు చేయవచ్చు. స్మార్ట్ రింగ్‌ను హాంకాంగ్‌కు చెందిన టోపీ అనే కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ రింగ్ ఫోన్ యాప్‌తో కలిసి పనిచేస్తుంది. వినియోగదారులు ఫోన్లోని సంబంధిత యాప్ నుంచి బ్యాంక్ ఖాతాలను రింగ్‌కి లింక్ చేయాలి. ఆ తర్వాత మీరు ఈ రింగ్‌ని ఏదైనా దుకాణం, పేమెంట్ మెషీన్‌కి చూపడం ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ రింగ్ టెక్నాలజీని జువెలరీ కంపెనీలకు అందిస్తే వెండి, బంగారంతో కూడా స్మార్ట్ రింగ్స్ తయారు చేసుకోవచ్చు. ఈ ఇంకా రింగ్ ఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. స్వదేశీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ స్టార్టప్ 7 రింగ్ కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం స్మార్ట్ రింగ్‌ను ప్రారంభించింది. NPCI సహకారంతో ఇండియన్ బ్రాండ్ 7 అభివృద్ధి చేసింది. ఇది 7 వేర్వేరు పరిమాణాలలో అందుబాటులో ఉంది. ఇది ప్రీమియం జిర్కోనియా సిరామిక్ మెటీరియల్‌తో తయారైంది.
ఈ రోజుల్లో, వైర్లెస్ ఇయర్‌బడ్‌లు ట్రెండ్‌లో ఉన్నాయి. ఈ ఉత్పత్తి పేరు బోట్ ఇమ్మోర్టల్ కటన బ్లేడ్. చాలా ఆకర్షణీయంగా, ప్రత్యేకంగా, తక్కువ ధరకు అద్భుతమైన ఇయర్‌బడ్స్‌ను ఇటీవల boAt ప్రారంభించింది. ఇది గేమర్లకు ప్రత్యేకం. ఇవి బ్లేడ్ గ్రే, గన్మెటల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయ్యింది. భారతదేశంలో బోట్ ఇమ్మోర్టల్ కటన బ్లేడ్ ధర రూ. 2,299గా ఉంచారు. వినియోగదారులు అమెజాన్ లేదా కంపెనీ సైట్ నుంచి వీటిని కొనవచ్చు. ఈ పరికరం యొక్క ప్రత్యేక భాగం దాని ఛార్జింగ్ కేస్. దీన్ని తెరవడానికి, మీరు దానిని స్లైడ్ చేయాలి. మీరు స్లైడ్ చేసిన వెంటనే దాని లోపలి నుంచి కత్తి బయటకు వచ్చినట్లు శబ్దం వస్తుంది. అలాగే, పరికరం చుట్టూ RGB లైట్లు బర్న్ అవ్వడం ప్రారంభిస్తాయి. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఛార్జింగ్ కేసులో ఇచ్చిన కవర్ కూడా మెటల్‌తో తయారు చేశారు. ఛార్జింగ్ కేసు ఆడటానికి బొమ్మలా కనిపిస్తుంది. అంతే కాకుండా RBG లైట్లు, సౌండ్లు కూడా గేమింగ్ అనుభూతిని అందిస్తాయి. కాల్ ఆఫ్ డ్యూటీలో పరీక్షించినప్పుడు, అడుగుజాడలు, తుపాకీ కాల్పులు, పేలుళ్లు చాలా కచ్చితత్వంతో వినిపించా. అయితే, సాధారణ పాటలలో మీరు బాస్ చాలా తక్కువగా చూడవచ్చు. ఆడియో నాణ్యత గురించి చెప్పాలంటే, ఇందులో 13mm డ్రైవర్లు ఉన్నాయి. అలాగే, పాటలు వింటున్నప్పుడు టోటల్ ఆడియో నాణ్యత మీకు నచ్చకపోవచ్చు. ఈ ఇయర్‌బడ్‌లు గేమింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించినవి, ఆ విషయంలో వీటికి మంచి రేటింగ్ ఉంది. గేమింగ్ కోసం 50ms తక్కువ-లేటెన్సీ మోడ్ కూడా అందుబాటులో ఉంది. అంతే కాకుండా, ఇది ASAP ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. కంపెనీ 50 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్పింది. ఛార్జింగ్ కోసం, టైప్-సి పోర్ట్ ఇందులో ఉంది. అందువల్ల దీనిని కేవలం 10 నిమిషాల పాటు ఛార్జ్ చేయడం ద్వారా 180 నిమిషాల పాటు ఉపయోగించవచ్చు.
2024 జనవరి 4న Vivo X100 ఇంకా X100 Pro స్మార్ట్ఫోన్లు భారతదేశంలో ఆవిష్కరించబడతాయి. వచ్చే వారం గురువారం Vivo కొత్త ఫోన్లను పరిచయం చేయడానికి వర్చువల్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఇండియాలో Vivo X100 అండ్ X100 ప్రో స్మార్ట్ఫోన్ల లాంచ్ తేదీ ప్రకటించింది. కంపెనీ తాజా ఫ్లాగ్షిప్ ఫోన్లు ఎక్స్-సిరీస్, ప్రీమియం జీస్ ఆప్టిక్స్ కెమెరాల వారసత్వాన్ని కొనసాగిస్తోంది. Vivo స్మార్ట్ఫోన్లు OnePlus 12 ఇంకా Xiaomi 13/14 సిరీస్ వంటి వాటితో మార్కెట్లో పోటీ పడుతున్నాయి. X100, X100 ప్రోల మధ్య పెద్ద తేడా ఏమిటంటే బ్యాక్ కెమెరాలో అదనపు కెమెరా అండ్ వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఉంటుంది. X100 పెద్ద 5000mAh బ్యాటరీతో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే, ప్రో మోడల్ 100W వైర్డు ఫాస్ట్ అండ్ 50W వైర్లెస్ ఛార్జింగ్‌తో 5400mAh బ్యాటరీని పొందుతుంది. Vivo X100 అండ్ X100 Pro 6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K రిజల్యూషన్ ఉంది. MediaTek నుండి సరికొత్త ఫ్లాగ్షిప్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, గరిష్టంగా 16GB RAM అలాగే 1TB స్టోరేజ్ కాన్ఫిగరేషన్లకు సపోర్ట్ ఇస్తుంది. రెండు డివైజెస్ ఇంటర్నల్ భాగాలకు శక్తినిస్తుంది. Funtouch OS వెర్షన్ భారతీయ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. Vivo X100 సిరీస్ ఇటీవలే చైనాలో ప్రారంభమైంది. చైనాలో 12GB+256GB Vivo X100 ధర CNY 3,999గా ఉన్నందున Vivo భారతదేశంలో ఈ ఫోన్ కోసం దాదాపు రూ. 50,000 వసూలు చేసే అవకాశం ఉంది. ఇక X100 Pro CNY 4,999కి రిటైల్ అవుతుంది. దీని ధర భారతదేశంలో రూ. 60,000 కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది.
ఈ రోజుల్లో ప్రతి ఆర్ధిక అవసరానికి UPI పేమెంట్ మోడ్ ఎంతో ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ వాడుతున్న వారిని అలర్ట్ చేస్తూ బిగ్ అప్ డేట్ ఇచ్చింది కేంద్రం. డిసెంబర్ 31 తర్వాత కొన్ని యూపీఐ ఐడీలు పని చేయవని అంటున్నారు. గత ఏడాది కాలంగా ఎలాంటి లావాదేవీలు చేయని యూపీఐ ఐడీలను ఇనాక్టివ్ ఐడీలుగా పరిగణిస్తూ డిసెంబర్ 31లోపు డీయాక్టివేట్ చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ కొద్ది రోజుల క్రితమే పేమెంట్ అప్లికేషన్స్ కి ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1వ తేదీ నుంచి ఏ UPI IDలు ఇనాక్టివ్ గా ఉన్నాయో ఆ యూపీఐ ఐడీలు పని చేయవు. ఇనాక్టివ్ ఐడీలకు సేవలు నిలిపివేయనున్నారు. ఇనాక్టివ్ యూపీఐ ఐడీలతో మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, అలాగే కస్టమర్స్ మొబైల్ నెంబర్స్ మారిన సందర్భాల్లో తప్పుడు ట్రాన్సాక్షన్లు జరగకుండా ఉండడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ తెలిపింది. యూపీఐతో బ్యాంక్ అకౌంట్‌ను ఫోన్ నంబర్ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ లింక్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ తో బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకున్న వారు UPI నుంచి తరచుగా ట్రాంజాక్షన్లు చేయడం మంచిది. అదేవిధంగా అప్పుడప్పుడు ఫోన్ లో UPIకి సంబందించిన సమాచారం, ట్రాంజక్షన్ వివరాలు చెక్ చేస్తూ ఉండాలి. దీని వల్ల మీ అకౌంట్ యాక్టివ్ గా ఉంటుంది. మోసాలకు ఆస్కారం ఉండదు.