అక్రమంగా గోవధకు తరలిస్తున్న 40 పశువులను మదనపల్లి గో సంరక్షణ సమితి, బిజెపి, ఆర్ఎస్ఎస్, విహెచ్పి నేతలు బుధవారం సాయంత్రం అడ్డుకుని పట్టుకున్నారు. పట్టుబడిన పశువులను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. గో సంరక్షణ సమితి పశువులను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నా మరోవైపు వదిలిపెట్టేస్తున్నారని పోలీసుల తీరిపై వారు మండిపడ్డారు. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసులు తమిళనాడులోని గోవధశాలకు పశువులను అక్రమంగా తరలించే నిందితులపై కఠినమైన కేసులు నమోదు చేసి అరెస్టు అనంతరం, వాహనాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
technology news
పుంగనూరు, బీడీ కాలనీ వద్ద ఆటోను ఢీకొన్న స్కూల్ బస్. ఆటోలో కూలీ పనులకు వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులు పెద్దపంజాని(మం)భద్రాచలం కు చెందిన వారిగా గుర్తింపు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలింపు. స్కూల్ బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది అని పోలీసులు వెల్లడించారు.
కర్నాటక రాష్ట్రం బెంగుళూరులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి అపూర్వ స్వాగతం ఏర్పాట్లు. ఇవాళ బెంగుళూరు సిటీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రానున్న చంద్రబాబు కోసం భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు. చిత్తూరు టిడిపి నాయకుడు జి.జే.ఎమ్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ గురజాల జగన్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఫ్లేక్సిలు,స్వాగత తోరణాలు ఏర్పాటు. రోడ్డుకి ఇరు వైపులా భారీ ప్లెక్కీలు,స్వాగత తోరణాలు ఎర్పాటు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగున్నర ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలను నడిపించారు. పిఏ రవి ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో ల్యాప్‌టాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం చాలా మంది ల్యాప్‌టాప్‌లు వాడుతున్నారు. ఈ చిట్కాలు పాటిస్తే మీ ల్యాప్‌టాప్ ఇంత శుభ్రంగా ఉంటుంది. ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై ఉన్న గీతలను శుభ్రం చేయడానికి ఎరేజర్‌ను ఉపయోగించవచ్చు. ల్యాప్‌టాప్ స్క్రీన్ ఎరేజర్‌తో సున్నితంగా రుద్దండి. నాలుగైదు నిమిషాల పాటు రుద్దితే ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై గీతలు తొలగిపోతాయి. ల్యాప్‌టాప్ స్క్రీన్ స్క్రాచ్‌లను ఆల్కహాల్‌తో కూడా శుభ్రం చేయవచ్చు. ఆల్కహాల్లో ముంచిన మృదువైన గుడ్డతో స్క్రీన్‌ను తుడవండి. ఇది అన్ని మరకలను తొలగిస్తుంది. అలాగే స్క్రీన్ కొత్తగా కనిపిస్తుంది. ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై పెట్రోలియం జెల్లీని అప్లై చేసి మైక్రోఫైబర్ క్లాత్‌తో రుద్ది కాసేపు అలాగే ఉంచాలి. కొంత సమయం తర్వాత పొడి గుడ్డతో తుడవండి మరియు మీ ల్యాప్‌టాప్ స్క్రీన్ శుభ్రంగా ఉంటుంది. నానో-హైబ్రిడ్ టెక్నాలజీతో, ఈ ప్రీమియం పాలిష్ ల్యాప్‌టాప్‌ల నుండి మరకలను సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది.
మొబైల్ ఫోన్ సిమ్ కార్డుల జారీకి సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ కొత్త రూల్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇకపై సిమ్ కార్డులు తీసుకునేందుకు పేపర్ విధానం కనుమరుగు కానుంది. సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్ అమలోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్ విధానాన్ని టెలికాం విభాగం డాట్ నిలిపివేసింది. దాని స్థానంలో డిజిటల్ వెరిఫికేషన్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త రూల్ వచ్చే ఏడాది అంటే జనవరి 1, 2024 నుంచే అమలులోకి వస్తుందని డాట్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దిగ్గట టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ కొత్త నిబంధనలు అమలులోకి రావడం వల్ల సిమ్ కార్డుల మోసాలను సైతం అరికట్టొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మొబైల్ నెట్వర్క్ సిమ్ కార్డుల జారీకి పేపర్ విధానంలో ఫారం నింపాల్సి ఉంటుంది. దీనికి గుర్తింపు పత్రాలు, ఫొటోల వంటివి జత చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇకపై పూర్తి స్థాయిలో సిమ్ కార్డుల జారీ, కేవైసీ వెరిఫికేషన్ విధానాన్ని డిజిటల్‌గా మార్చనుంది కేంద్రం. ఎప్పటికప్పుడు మారుతున్న కేవైసీ నిబంధనల్లో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్లు టెలికాం విభాగం డాట్ ఓ నోటిఫికేషన్లో వెల్లడించింది. మరోవైపు సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలను సైతం అరికట్టొచ్చని కేంద్ర సర్కార్ భావిస్తోంది. సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న కొన్ని చర్యల్లో భాగంగా కొత్తగా ఈ డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చింది.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు, స్వామి వారి లిప్తపాటు దర్శనం తో జన్మ ధన్యమైందని భక్తులు భావిస్తారు. విశేష పర్వదినాలలో స్వామివారిని చూసి తరించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. అందులో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల కు భక్తులు విశేషంగా వచ్చారు స్వామి వారి దర్శనం తో పాటు ఆలయంలోనూ వెలుపల ప్రత్యేక అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులు చేశాయి. ఉద్యానవన విభాగం ఏర్పాటుచేసిన నమూనా ఆలయం అందరిని తన్మయత్వానికి గురిచేశాయి. శ్రీవారి ఆలయం మరియు ఆలయం వెలుపల పుష్పాలంకరణ భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ పర్యాయం 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో అద్భుతమైన అలంకరణలను చేశారు. ముఖ్యంగా ఆలయం లోపల పుష్పాలతో ఏర్పాటు చేసిన దశావతారాలు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. మరోవైపు స్వామివారిని దర్శించుకొలేని భక్తుల కోసం ఆలయం వెలుపల శ్రీరంగం శ్రీ రంగనాధ స్వామిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన నమూనా భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది.
తాజాగా ఆన్లైన్ సెక్యూరిటీని రక్షించడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా రన్ అయ్యే “సేఫ్టీ చెక్” అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. గూగుల్ క్రోమ్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. కోట్లాదిమంది యూజర్లు దీనిని వాడుతున్నారు. గూగుల్ క్రోమ్ పరిచయం చేసిన ఈ కొత్త ఫీచర్ నాలుగు చెకింగ్ టూల్స్ అందిస్తుంది. అవేవో తెలుసుకుందాం. సేఫ్టీ చెక్ ఫీచర్ క్రోమ్‌లో సేవ్ చేసిన ఏవైనా పాస్వర్డ్లు లీక్ అయ్యాయా లేదా హ్యాకర్లు తస్కరించారా అనే వివరాలను అని ఇది చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ వివరాలు లీకైనా లేదంటే ఎవరైనా కొట్టేసినా ఈ ఫీచర్ వెంటనే అలర్ట్ చేస్తుంది. అప్పుడు ఓల్డ్ పాస్వర్డ్లు చేంజ్ చేసుకుని ప్రమాదం పెద్దదవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. సేఫ్టీ చెక్ ఫీచర్ క్రోమ్‌లో ఇన్స్టాల్ చేసిన ఏవైనా ఎక్స్టెన్షన్స్ హానికరమైనవా? కాదా? అని కూడా చెక్ చేస్తుంది. అవి హానికరమైతే యూజర్లను హెచ్చరిస్తుంది. తద్వారా వాటిని అన్ఇన్స్టాల్ లేదా డిలీట్ చేసుకోవచ్చు. మోస్ట్ అప్ టు డేట్ సెక్యూరిటీ ప్యాచ్‌లను కలిగి ఉన్న క్రోమ్ లేటెస్ట్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారా లేదా అనేది కూడా ఇది చెక్ చేస్తుంది. లేకపోతే బ్రౌజర్‌ను అప్డేట్ చేయమని అడుగుతుంది. లొకేషన్, మైక్రోఫోన్, కెమెరా లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఏవైనా వెబ్సైట్లకు పర్మిషన్స్ ఇచ్చారో లేదో ఇది చెక్ చేస్తుంది. యూజర్ చాలా కాలం పాటు ఆ వెబ్సైట్లను విజిట్ చేయకపోతే, ఆ పర్మిషన్స్ తీసేయమని సజెస్ట్ చేస్తుంది. క్రోమ్‌లోని త్రీ-డాట్స్ మెనూ నుంచి “సేఫ్టీ చెక్” ఫీచర్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అది కనిపెట్టే సమస్యలపై సకాలంలో యాక్షన్ తీసుకొని ఏ చెడు జరగకముందే జాగ్రత్త పడొచ్చు.
మరో కొత్త ఫీచర్
గూగుల్ క్రోమ్ జోడించిన కొత్త ఫీచర్ సేఫ్టీ చెక్ మాత్రమే కాదు. డెస్క్‌టాప్‌లో “మెమరీ సేవర్” మోడ్‌ను కూడా మెరుగుపరిచింది. క్రోమ్ ఫాస్ట్, స్మూత్‌గా రన్ రావడానికి మెమరీ సేవర్ కీలక పాత్ర పోషిస్తుంది. మెమరీ సేవర్ మోడ్ రెండు పనులను చేస్తుంది. ఇది ప్రతి ట్యాబ్ ఎంత మెమరీని ఉపయోగిస్తుందో చూపిస్తుంది, ఎక్కువగా వినియోగించే వాటిని క్లోజ్ చేయడానికి సులభతరం చేస్తుంది. దీనితో కొన్ని వెబ్సైట్లను “ఆల్వేస్ యాక్టివ్”గా మార్క్ కూడా చేసుకోవచ్చు. తద్వారా అనేక ట్యాబ్‌లు తెరిచినప్పుడు అవి తాత్కాలికంగా క్లోజ్ లేదా ఇగ్నోర్ అవ్వవు.
ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కొత్త కొత్త సామర్థ్యాలతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంది. మనుషులు కష్టంగా భావించే, ఎక్కువ సమయం తీసుకునే పనులను అత్యంత సులువుగా, వేగంగా పూర్తి చేసేస్తోంది. సాధారణంగా ఒకరి చనిపోయే సమయాన్ని కచ్చితంగా ప్రెడిక్ట్ చేయడం అసాధ్యం. ఆ అసాధ్యాన్ని తాజాగా డెత్ కాలిక్యులేటర్ అని పిలిచే కొత్త AI టూల్ సుసాధ్యం చేసి చూపిస్తోంది. తాజాగా ఏఐ మనుషుల మరణాలను అంచనా వేసే స్థాయికి ఎదిగింది. ఇది వివిధ కారకాల ఆధారంగా ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో 78 శాతం ఖచ్చితత్వంతో అంచనా వేస్తోంది. వీరు లైఫ్2వెక్ అనే అల్గారిథమ్‌ను రూపొందించడానికి చాట్‌జీపీటీ వెనుక ఉన్న టెక్నాలజీని ఉపయోగించారు. డెత్ కాలిక్యులేటర్‌ను టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ అల్గారిథమ్ ఇన్కమ్, ఆక్యుపేషన్, లోకేషన్, హెల్త్ హిస్టరీ వంటి డేటాను విశ్లేషిస్తుంది. నిర్దిష్ట కాల వ్యవధిలో ఎంత కాలం మనుగడ సాధించగలరనే వివరాలను అందిస్తుంది.
లూయిస్ విట్టన్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇంకా పాపులర్ బ్రాండ్. ఇప్పుడు లూయిస్ విట్టన్ ఇయర్ఫోన్లను లాంచ్ చేసింది. లూయిస్ విట్టన్ బ్రాండ్ చెప్పులు ఇంకా బూట్లతో సహా అనేక ఉత్పత్తులను అందిస్తుంది. న్యూఢిల్లీ స్మార్ట్‌ఫోన్ అండ్ ఇయర్‌ఫోన్ రెండూ ఇంటెగ్రల్ పార్ట్. డైలీ లైఫ్ లో ఈ రెండూ ఉండాలి. మార్కెట్లో చాలా రకాల ఇయర్ఫోన్లు ఉన్నాయి. ఇయర్ఫోన్లు తక్కువ ధర నుండి అత్యధిక ధర వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రముఖ అండ్ ఖరీదైన బ్రాండ్ లూయిస్ విట్టన్ ఒక ఇయర్ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లాంచ్ పెద్దగా సందడి చేయలేదు. కానీ దీని ధర కారణంగా, ఈ ఇయర్‌ఫోన్ వైరల్‌గా మారింది. ఎందుకంటే దీని ధర 1,660 US డాలర్లు. భారత రూపాయిలలో సుమారుగా 1.38 లక్షలు. సోనీ, యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ సహా పలు బ్రాండ్లు ఇయర్ఫోన్లను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ ఇయర్‌ఫోన్ ధర కారణంగా వైరల్ అవుతోంది. అద్భుతమైన డిజైన్, సూపర్ సౌండ్ క్వాలిటీతో లూయిస్ విట్టన్ వైర్లెస్ ఇయర్ఫోన్లను కొనుగోలు చేయడానికి దీని ధర 1.38 లక్షల రూపాయలు. కొత్త ఇయర్ఫోన్లు 5 రంగులలో లభిస్తుంది. దీని డిజైన్, కలర్, స్టెయిన్లెస్ స్టీల్ ఫినిషింగ్‌తో సహా అనేక ఆకర్షణలతో ఉంది. ఇతర ఇయర్ఫోన్ల లాగానే బ్లూటూత్‌లో మల్టీపాయింట్ ఫీచర్ ఉంది. దీని ద్వారా మీరు ఒకే సమయంలో మల్టి డివైజ్‌లకు బ్లూటూత్‌ను కనెక్ట్ చేయవచ్చు. మరో విశేషమేమిటంటే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 28 గంటల పాటు ఇయర్ ఫోన్ వాడుకోవచ్చు.