తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్లికేషన్లను ఇంకా తీసుకుంటున్నారు. రైతు భరోసా పథకం డబ్బులు పొందాలంటే మార్చి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అంటే మరో మూడు రోజుల పాటు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చన్నమాట. ఫిబ్రవరి 28వ వరకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు, ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఉందని వాళ్ళు కొత్తగా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది.
బ్యాంకు వివరాలు నమోదు చేయని వారు కూడా అప్లై చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. అప్లికేషన్ ఫామ్ తో పాటు పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, మొబైల్ నెంబర్ వివరాలు ఈ పథకానికి అప్లై చేసేటప్పుడు జత పరచాలి. దీనిపై పూర్తి వివరాల కోసం మండల అగ్రికల్చర్ అధికారిని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. ఇది ఇలా ఉండగా తాజాగా 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ. 3600 కోట్లు రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. మిగిలిన రూ. 5400 కోట్లకు సంబంధించి మరో 20 రోజుల్లో రూ. 2700 కోట్లు విడుదలవుతాయని తెలిపారు. ఆపై మరో 20 రోజుల్లో మిగతా రూ. 2700 కోట్లు జమ చేస్తామని ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఈ నిధులను విడుదల చేయగా, ఇవాళ రైతుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి.





Total views : 142011