తెలంగాణ(Telangana) ఇంటర్ ఫలితాలు(Inter Results) బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ(Education Principal Secretary) బుర్రా వెంకటేశం(Burra Venkatesham) తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నట్లు వెల్లడించారు. పరీక్ష రాసిన విద్యార్థులు పలితాలను http://www.manabadi.co.in/ వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/ లేదా https://results.cgg.gov.in/ వెబ్సైట్లోనూ చెక్ చేసుకోవచ్చని తెలిపారు.
ఇది చదవండి: ఏపీ, తెలంగాణలో నేడు నుంచి వేసవి సెలవులు ప్రారంభం..
అయితే.. తొలత ఇంటర్ మొదటి రెండవ సంవత్సరం ఫలితాలను ఏప్రిల్ 23న (మంగళవారం) విడుదల చేయాలని భావించారు. అయితే.. పలు కారణాలవల్ల ఏప్రిల్ 24 (బుధవారం) ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక.. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు.. ద్వితీయ సంవత్సరంలో 46,542 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా…
- సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
- వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున జరుగుతున్న గంజాయి సాగు కలకలం రేపింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆశ్రమంలో అక్రమంగా గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు.యాలాల మండలం గోవిందరావుపేట గ్రామ శివారులో హైదరాబాద్ బోరబండకు చెందిన పప్పులాల్ పది ఎకరాల భూమిని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 223738