తిరుమల. శ్రీవారి ఆలయంలో శాస్త్రోకంగా ముగిసిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేసిన ఆలయ అర్చకులు, అధికారులు. టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కామెంట్స్. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఆలయాన్ని శుద్ది చేశాం. ఏడాదికి నాలుగు పర్యాయాలు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. వివిధ సుగంధ పరిమళాలు కలిగిన ఈ లెపనం తో ఆలయ గోడలను శుద్ది చెయ్యడం జరిగింది. తద్వారా ఆలయ గోడలకు ఎలాంటి ముప్పు ఉండదు. వేలాది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించాం.
Tirupati
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 56,344
మంది భక్తులు దర్శించుకుని. మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న హుండీ ఆదాయం. 4.26 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…17,616 మంది, శ్రీవారి సర్వదర్శనానికి 05 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లు లేని భక్తులకు 08 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
చిల్లకూరు వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ముగ్గురికి గాయాలు. శబరిమలై నుండి నెల్లూరు వైపు వెళ్తున్న టెంపో ముందు వెళ్తున్న ఆటోను డీ కొట్టడంతో జరిగిన ప్రమాదం. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చిల్లకూరు పోలీసులు….
ఈనెల 26,27న ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి సందర్శిస్తున్నారు. 26వతేదీ సాయంత్రం వాయుసేన విమానంలో తిరుపరి విమాశ్రయానికి చేరుకుంటారు. తిరుమల వెళ్ళి రాత్రి బస చేస్తారు. 27వ తేదీ ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నఅనంతరం తిరుపతి నుండి హైదరాబాదు బయలుదేరి వెళతారు. ప్రధాన మోదీ పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వీడియో సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు.
గంజాయి అక్రమ అమ్మకాలపై పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ… స్మగ్లర్లు మాత్రం ఏదో విధంగా అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. పీడీ యాక్టులు ప్రయోగించినా ఫలితం లేకుండా పోతోంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో రోజురోజుకు గంజాయి అమ్మకాలు పెరిగిపోతూనే ఉన్నాయి. గంజాయి అక్రమ అమ్మకాలపై సెబ్ అధికారుల దాడులు నిర్వహించారు. వెంకటగిరి పట్టణం అంబేడ్కర్ నగర్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు చేస్తున్న ఆరవ రమణయ్య, రవణమ్మ అనే దంపతుల ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 35 వేల రూపాయల విలువగల కేజీ 600 గ్రాముల గంజాయిని సీజ్ చేసి, నిందితులను అరెస్టు చేశామని సెబ్ సిఐ తెలిపారు. గంజాయి అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.