ts politics
ఆమనగల్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దీవెన సభలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నవ నిర్మాణ భారత్ గా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో రాజరిక పాలన నడుస్తుంది. 2017 ముందు యూపీ లో ఇలాగే పాలన ఉండేది. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏంతో ఆనందంగా ఉన్నారు. కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారిని గెలిపించాలి. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి దశకు వచ్చింది. రామ మందిరం ప్రారంభోత్సంలో కల్వకుర్తి రామ భక్తులకు దర్శనం చేసుకుని అవకాశం కల్పిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే యూపీ తరహా అభివృద్ధి చేస్తాం.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ లోని కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ నివాసంలో అర్ధరాత్రి విజిలెన్స్ మరియు ఐటీ దాడులు సోదాలు నిర్వహించారు. పోలీసులు వచ్చిన సమయంలో సంపత్ కుమార్ నివాసంలో లేకపోవడంతో ఆయన సతీమణి మహాలక్ష్మి భయభ్రాంతులకు గురయ్యారు. సంపత్ కుమార్ సతీమణి స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ప్రచారం లో పాల్గొని ఇంటికొచ్చిన సంపత్ కుమారు తన సతీమణి ని 108 లో కర్నూలు కిమ్స్ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మహిళా కానిస్టేబుల్ లేకుండా ఇంట్లోకి ఎలా వెళ్తారని సంపత్ కుమార్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంట్లో ఎలాంటి డబ్బులు దొరకపోవడంతో అధికారులు వెళ్లిపోయారు. నా నివాసానికి ఐటీ అధికారులా.. ఈడి అధికారులా తేల్చాలని సంపత్ కుమార్ స్థానిక సీఐ శివశంకర్ గౌడ్ తో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో దాడులు చేసిన అధికారులు ప్రస్తుతం కనిపించడం లేదని వారు ఎక్కడున్నారని పిలవాలని పోలీసులతో సంపత్ కుమార్ చెప్పారు. సంపత్ కుమార్ నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులను మీడియా వివరణ కోరగా నో కామెంట్ అని పోలీసులు తెలిపారు.
బిల్డింగ్ పై కూర్చున్న ప్రజలను సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి చూపెట్టండి మీరు నాకు కనబడాలి. ఎగువ ప్రాంత రైతులకు ఒక కల ఉండేది. ఎప్పుడు ఎర్రటి ఎండల్లో ఎగువ నర్మాల మనేర్ మత్తడి దుకుతుంది అని అనుకున్నారా ఆ కళా సాకారం ఇప్పుడు అయ్యింది. ఒకప్పుడు కరెంటు లేక పవర్ హాలిడే ప్రకిటించేది. కానీ ఇప్పుడు 24 గంటల కరెంటు ఉండడంతో వలసలు తగ్గాయి. కరెంటు గురించి కాంగ్రెస్ కు మాట్లాడే హక్కు లేదు. 30 తేదీన బటన్ నోక్కే టప్పుడు ఒకటే ఆలోచన చేయండి 24 గంటల కరంటు కావాలా, 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా ఆలోచన చేసి ఓటు వేయండి. రేపు లేదా ఎల్లుండి రైతు బందు డబ్బులు పడుతాయి, టింగు టింగు మని మేసేజులు వస్తాయి చూడండి. అప్పర్ మనెరు దగ్గర రెండు బ్రిడ్జి లు కట్టిస్తాను. మనేరూ ప్రాజెక్ట్ ను టూరిస్ట్ ప్లేస్ గా మర్చుతాను. మండలంలో ని అన్ని గ్రామాల స్కూల్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం. పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ వెళ్లకుండా చేస్తాను. మళ్ళీ ఒక్కసారి గెలిపిస్తే దేశం లోనే మన సిరిసిల్ల నియోజకవర్గం ను నెంబర్ వన్ గా నిలబెడతాను. ఇక్కడ ఉన్న కేజీ టు పీజీ స్కూల్లో చేరి పలకతో రండి పట్టాతో వెళ్ళండి. 30 తేదీన కారు గుర్తుకు ఓటు వేయండి భారీ మెజారిటీతో గెలిపించండి. మండలంలో కేంద్రం లో డబుల్ రోడ్డు చేస్తాను, ఏమన్న ఇబ్బంది కలిగితే నష్ట పరిహారం చెల్లిస్తాం.
కొద్దిగా ఆలస్యం అయ్యింది ఎం అనుకోవద్దు. నన్ను మన్నించాలి. ఇక్కడ ఉన్న ఆడబిడ్డలకు ఒక్కటే అడుగుతున్న ఎల్లారెడ్డి పేట కు ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన్న లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎల్లారెడ్డి పేట ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎల్లారెడ్డి పేట ఎలా ఉంది చూడండి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎరువుల కోసం ఎల్లయ్య అనే రైతు లైన్ లో నిలబడి చనిపోయాడు. ఇక్కడ రోడ్డు పై ఉన్న షాప్ వాళ్ళను అడగండి ఎప్పుడు ఇన్వర్టర్ పెట్టుకొని బిజినెస్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు 24 గంటల కరెంటు ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. వాళ్ల రొచ్చు మాటలు వినే పరిస్థతి లేదు. దేశంలో ఎవరు రైతు బందు ఇవ్వలేదు, మన కెసిఆర్ రైతు బందు ఇచ్చాడు. రేవంత్ రెడ్డి 24 గంటల కరెంటు లేదు అని అని అంటున్నాడు, ఒక్కసారి ఎల్లారెడ్డి పేట మండలంలో ఏ ఊరికి వచ్చిన 24 గంటల కరెంటు చూపిస్తా. ఎల్లారెడ్డి పేట లో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాం. మండలంలోని అన్ని గ్రామాల ప్రభుత్వ స్కూల్స్ బాగు చేస్తాం. కాంగ్రెస్ అనేది దున్నపోతు నమ్మి మోసపోవద్దు పాలిచ్చే బీఆర్ఎస్ ను గెలిపించుకుందాం. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే వారానికి రెండుసార్లు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉంటాను. మండలంలోని అన్ని గ్రామాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ మాటల నమ్మకండి, బిఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలి. మీ కడుపులో పుట్టిన బిడ్డగా అనుకొని ఆశీర్వదించి మల్లొకసారి గెలిపించాలి. 30వ తేదీన ఒకటో నెంబర్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో చొప్పదండి బీజేపీ అభ్యర్థి బొడిగా శోభ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడారు. తమ వర్గానికి చెంది బిడ్డను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పెన్షన్, ఆరోగ్య శ్రీ పథకం వంటి అనేక అంశాల పై పోరాటం చేసినట్లు తెలిపారు. 30 ఏళ్లుగా ఒకే జెండా కింద పని చేస్తూ పోరాడానని, వర్గీకరణ కోసం ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించు కోలేదని తెలిపారు. మాదిగ జాతి బిడ్డల భవిష్యత్ కోసం పోరాటం చేశానని, గత పాలకులు మనల్ని విస్మరించారని గుర్తుచేశారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మన కోసం వచ్చి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని, ఇందుకోసం కమిటీ వేస్తున్నామని ప్రకటించారని పేర్కొన్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకునే పార్టీ ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. ఉద్యమ సమయంలో అండగా నిలిచిన తనను కేసీఆర్ సీఎం అయ్యాక రెండుసార్లు జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మాదిగ బిడ్డ లేడన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేయవద్దని అన్నివర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం మాదిగ యువత
ఉద్యమించారని, అటువంటి మన ఉద్యమాన్ని కేసీఆర్ అణచివేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల వద్దకు వెళ్లిన తనను వారు పట్టించుకోలేదని, బీజేపీ నాయకులు మన దగ్గరకు వచ్చి మాదిగలను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. శోభను భారీ మెజార్టీతో గెలిపించాలని, కమలం పువ్వుగుర్తుకు ఓటేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ముస్లీంలకు నిజమైన శతృవు కాంగ్రెస్ పార్టీ అని, ముస్లీం సమాజాన్ని ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ కు మద్ధతుగా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లిలో నిర్వహించిన రోడ్ షో లో కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. ముస్లీంల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని తెలిపారు. ఆ పార్టీ లౌకిక పార్టీ కాదని విమర్శంచారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మతకల్లోలాలు జరుగుతున్నాయని, గతంలో మన దగ్గర కూడా కాంగ్రెస్ హయాంలో తరుచూ మతకల్లోలాలు, కర్ఫ్యూలతో భయంకరమైన పరిస్థితి ఉండేదని, కానీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న మతకల్లోలం కూడా జరగలేదని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని, దేవాలయాలు, మసీదులు, చర్చిలకు, గురుద్వారలకు ఖజానా నుంచి డబ్బులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఏ ఒక్క మతం పట్ల తాము వివక్ష చూపకుండా పరిపాలించామని స్పష్టం చేశారు. తెలంగాణలో మతసామరస్యం ఇలాగే వర్ధిల్లాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగాలని అన్నారు. “కార్ కా నిషాన్… తెలంగాణ కా షాన్ హై” అని వ్యాఖ్యానించారు.
సూర్యాపేట జిల్లా, కోదాడ, మోతే మండలం బళ్ళుతండాలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలనుచెదరగొట్టారు. తమ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రచారానికి రానివ్వము అంటూ కాలనీవాసులు అడ్డుకున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రోత్సాహం తోటి దాడి చేశారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. పోలీసుల లాఠీ చార్జిలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డికి గాయాలయ్యాయి.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉన్న ప్రాంతానికి వచ్చినందుకు నేను ఎంతో అదృష్టవంతున్ని. భువనగిరి ఖిల్లను చూస్తే చాలా భాద అనిపించింది. కోటను 25కోట్లతో అభివృద్ధి చేస్తాం. తెలంగాణ లో బిజెపి అధికారంలోకి వస్తే మూసి ప్రక్షాళన చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలే బాగుచేయలి. నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇస్తానని కేసీఆర్ మాట తప్పారు. భూదాన్ పోచంపల్లిలో వినోదాభావే భూదాన్ ఉద్యమం చేస్తే ఇప్పుడు కేసీఆర్ భూ కబ్జా ఉద్యమం చేస్తున్నారు. కెసిఆర్ రాష్ట్రంలో వేలకోట్ల రూపాయల భూములను కబ్జా చేశాడు. బిజెపి అధికారంలోకి రాగానే కెసిఆర్ అవినీతిపై విచారణ జరిపి జైల్లో పెడతాం. తెలంగాణలో బిఆర్ఎస్ కు విఆర్ఎస్ కాలేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా విషయంలో కెసిఆర్ ఎన్నడు మోడీని కలవలేదు. కేసీఆర్ అబద్దాలను చెబుతున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కెసిఆర్ కు వేసినట్టే. 2014 ,2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లో చేరారు. ఎస్సీ వర్గీకరణకు బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉంది. బిఆర్ఎస్ సర్కార్ మిషన్ భగీరథ, మద్యం కుంభకోణాల్లో, ఓ ఆర్ ఆర్ కుంభకోణం, మిషన్ కాకతీయ, కాలేశ్వరం లాంటి కుంభకోణాలు చేశాయి. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేస్తాం. బిజెపి ఎమ్మెల్యేలను గెలిపిస్తే తెలంగాణను నెంబర్ వన్ గా చేస్తాం.
తెలంగాణ ఎన్నికల్లో రైతుబంధు చుట్టూ రాజకీయం అల్లుకుంది. అన్నదాతల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పార్టీల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది. కేసీఆర్ సర్కారు సీజన్ వారీగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. తెలంగాణలో మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వారి ఖాతాల్లోకి 7,700 కోట్ల రూపాయలు జమ చే్స్తోంది. తెలంగాణలో ఎక్కువగా ఉన్నది రైతుల ఓట్లే. పోలింగ్ కు కొన్ని రోజుల ముందు ఒకటిక కాదు, రెండు కాదు… ఏకంగా 7,700 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వెళ్లున్నాయనగానే బీఆర్ఎస్ లో ఆనందం, కాంగ్రెస్ లో ఆందోళన వ్యక్తమైంది. ఇది కచ్చింతంగా తెలంగాణ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.




Total views : 62249