తమిళగ వెట్రి కజగం TVK పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి ఇవాళ విచారణకు హాజరు కావాలని సీబీఐ తాజాగా సమన్లు పంపించింది. సెప్టెంబర్ 27, 2025న కరూర్‌లో జరిగిన TVK పార్టీ బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. కేవలం 10,000 మందికి అనుమతి ఉన్న చోట సుమారు 30,000 మంది పైగా తరలివచ్చారు. విజయ్ రాక 7 గంటలు ఆలస్యం కావడంతో అభిమానులు ముందుకు దూసుకు రావడంతో ఈ విషాదం జరిగింది. 9 మంది చిన్నారులు, 18 మంది మహిళలతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు . విజయ్ ఇప్పటికే జనవరి 12న తొలి విచారణ, జనవరి 19న రెండో విచారణ జరిగాయి.. రెండూ దాదాపు 6 గంటల పాటు కొనసాగాయి. ఈ విచారణలో విజయ్ — “తొక్కిసలాట ఘటనకు TVK పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదు, పరిస్థితి చేయి దాటిపోకూడదన్న ఉద్దేశంతో తాను వెళ్లిపోయాను” అని సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు . ఇదే కేసులో TVK పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్, ఎలక్షన్ మేనేజ్మెంట్ డివిజన్ జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా సెక్రటరీ మతియఝగన్‌లను కూడా సీబీఐ ఇప్పటికే విచారించింది. ఈ నేపధ్యం లో ఇవాళ విజయ్ సీబీఐ కార్యాలయంలో హాజరవుతారా లేదా అన్న విషయంపై అందరి దృష్టి నెలకొంది.
vijay
కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ త్వరలోనే కొత్తపార్టీ ప్రారంభించబోతున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా పనయూర్లోని తన కార్యాలయంలో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో విజయ్ సమావేశం నిర్వహించారు. చెన్నై, కోవై, తిరుచ్చి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్నవారు విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించాల్సిందేనని డిమాండ్ చేశారు. విజయ్ కూడా గతానికి భిన్నంగా రాజకీయాలపై చర్చించినట్టు తెలిపారు. అంతేకాదు, మరో ఆరు నెలల్లో ఆయన కొత్త పార్టీ ప్రారంభించబోతున్నట్టు కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏదైనా పార్టీకి మద్దతివ్వాలా? లేదంటే ఒంటరిగా బరిలోకి దిగాలా? అన్న అంశంపై మరోమారు నిర్వాహకులతో విజయ్ సమాశమవుతారని తెలుస్తోంది.





Total views : 78764