భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఒక కార్మికుడు అనుమానాస్పదస్థితిలో మృతి(Suspicious death) చెందిన ఘటన చోటు చేసుకుంది. శ్రీ సీతారామచంద్ర ఆలయానికి చెందిన సి ఆర్ ఓ కార్యాలయం (CRO Office) పైన ఉన్న డార్మెటరీల బాత్రూంలో మృతదేహాన్ని గుర్తించిన తోటి వారు అధికారులకు సమాచారం అందించారు. మృతుడు ఖమ్మం పట్టణానికి చెందిన టైల్స్ వేసే కార్మికుడు జాఫర్(40) గా గుర్తించారు. ఆలయానికి చెందిన జానకి సదనము వసతి గదుల నిర్మాణ పనుల నిమిత్తం గతం వారం రోజుల క్రిందట పని కోసం వచ్చిన జాఫర్ అనుమానస్పదంగా మృతి చెంది ఉండడంపై పోలీసులు విచారిస్తున్నారు. భద్రాచలం పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి చెందిన CRO కార్యాలయం పైన మృతదేహం ఉండటం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇది చదవండి: ప్రచారంలో దూసుకుపోతున్న తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 79287