సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. వాస్తవాలను మరుగునపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఈ బ్లాక్‍ను 2013లో నాటి యూపీఏ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ కు కేటాయించిందని ఇందులో బీజేపీ ప్రభుత్వం కొత్తగా అలాట్ చేసిందేంటని ప్రశ్నించారు. అయితే గతంలోనే కేటాయిస్తే 2013 నుంచి ఇప్పటి వరకు పెండింగ్ పెట్టారన్నారు. బ్లాక్ కేటాయింపు జరిగింది.. మైనింగ్ లీజు కోసం అనుమతి ఇవ్వలేదన్నారు.
కొత్త యాక్ట్ ప్రకారం తాడిచర్ల -2 సింగరేణికి ఇవ్వబోమని చెప్పారు. కానీ యాక్ట్ రావడానికి ముందే సింగరేణికి తాడిచర్ల-2 కేటాయించారనే ఈ విషయాలను మేము అధికారంలోకి వచ్చాక ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి వాస్తవాలను వారి ముందు ఉంచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి అనుమతులు తెచ్చిందని ఇప్పటికైనా అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణపై నిజంగా బీజేపీకి ప్రేమ ఉంటే సింగరేణి పరిధిలోని గనులన్నీ సింగరేణికే కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.





Total views : 195876