అణగారిన వర్గాలు, ముఖ్యంగా దళితుల కోసం మాట్లాడుతున్న పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి (Sujana Chowdary))కి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పేరుపొగు వెంకటేశ్వరరావు తెలిపారు. భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వర్గీకరణకు మోదీ అంగీకరించారని, అందుకే ఏపీలో ఎన్డీయే కూటమికి ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు తెలుపుతోందని, సుజనాకు తామందరూ మద్దతు ప్రకటిస్తున్నామని వెంకటేశ్వరరావు ప్రకటించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సుజనా ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మాల, మాదిగలకు నిధులు ఇవ్వకుండా జగన్ మోసం చేశారని, దళితులను బానిసలుగా చూశారని విమర్శించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్వాయి దాస్, సుబ్బారావు, నాగేశ్వరరావు, ప్రసాద్ తదితరులు కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే…
- ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ కన్నుమూత.భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది. తన గానామృతంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎన్నో అజరామర గీతాలను…
- కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .దేశంలో మరోసారి కమర్షియల్ సిలిండర్లపై భారీగా ధరలు పెరిగాయి. దీంతో వ్యాపార వర్గాలపై గ్యాస్ భారం మరింత ఎక్కువ అవనుంది. నేటి నుండి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెంచాయి. ఇది…





Total views : 90278