ప్రయాణికులకు మెరుగైన వసతులతో పాటు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆర్టీసి చైర్మన్ మల్లికార్జున రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో బస్టాండ్ లో సుమారు 2.5 కోట్లతో నూతనంగా నిర్మించిన బస్టాండ్ విస్తరణ నిర్మాణాలను ఆర్టీసి అధికారులు, వైకాపా నేతలతో కలిసి వారు ప్రారంభించారు. వీరికి ఆర్టీసి అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న బస్ స్టాండ్ ప్రాంగణం బస్సుల రవాణాకు, ప్రయాణీకుల సౌకర్యాలకు ఇబ్బందిగా ఉందని గుర్తించి.. అదనపు బస్ స్టాండ్ నిర్మాణానికి రూ 2.50 కోట్లు నిధులును మంజూరు చేయించామన్నారు. బస్ స్టాండ్ ప్రాంతాన్ని విస్తరించడంతో పాటు ఆధునిక వసతులతో భవనం, ఫ్లాట్ ఫార్మ్స్ విస్తరణ, లైటింగ్ లతో కూడిన సూచిక బోర్డులు, వర్టీకల్ టైల్స్, టాయిలెట్స్, ప్రహరీ గోడ ప్రయాణీకులకు సౌకర్యాల సుందరీకరణ తదితర అభివృద్ధి పనులు తీర్చి దిద్దడం జరిగిందన్నారు. దీంతో ప్రయాణీకుల ప్రాంగణం నగరాలలోని బస్ స్టాండ్ లకు ధీటుగా అభివృద్ధి చెందుతుందన్నారు. అదే విధంగా కడప- రాయచోటి, రాయచోటి- తిరుపతి కి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు వారు తెలియజేశారు.
YCP Government
సభ లో ప్రజల్ని చూస్తుంటే నాగావళి వంశధార నదులు పోటెత్తియా అన్న రీతిలో ఉంది కృష్ణదాసు జగనన్నకు అభిమాన దాసుడు .. అట్టడుగు వర్గనికి చెందిన నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నానంటే కారణం జగన్.. 1,12,795 కోట్లు సంక్షేమ ఫలాలను పేదలకు అందించాం.. 25 వెలు కోట్ల రూపాయలు గిరిజనుల కోసం ఖర్చు చేశాం.. రాష్ట్రం లో 151 సీట్లు గెలిచిన మనం 175 సీట్లు ఈజీగా గెలుస్తాం .. శ్రీకాకుళం లో మూలపేట పోర్ట్, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శుద్ధి జలాల నీటి అందించడం మా ప్రభుత్వ ఘనత.. నాలుగు సంవత్సరాలలో రూపాయి లంచం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించాం.. గతంలో ఏ ప్రభుత్వం కూడా అట్టడుగు వర్గాల అభివృద్ధికి చూడలేదు… ఎప్పుడూ అణగదొక్కాలని చూశారు.. కానీ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ పదవులు ఇచ్చిన ఘనత మనదే.. 2024 లో జగనన్న గెలుపు వన్ సైడ్ , టిడిపి సూసైడ్, జనసేన ఔట్ సైడ్ ఇది రాష్ట్ర ప్రజలు డిసైడ్..
వైసిపి ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని మండి పడ్డారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు. అధికార పార్టీ నేతలకు ప్రచార ఆర్భాటాల మీద ఉన్న శ్రద్ధ రైతుల విషయంలో లేదన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ మినిస్టర్ రైతుల పాలిటి ఇరిటేషన్ మినిస్టర్ గా మారారని మండిపడ్డారు. ఇద్దరు మంత్రులు ఉన్నాశ్రీకాకుళం జిల్లాలో వరి పొలాలు ఎండిపోతున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. సిఏం శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టకమునిపే కరువు జిల్లాగా ప్రకటించాలన్నారు. ఏంపి.వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై ఎలా కేసులు పెట్టాలో ఆలోచిస్తుంది తప్ప ప్రజలకు న్యాయం చేయటం లేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతుల పండించుకున్న పంటలు ఎండిపోతున్నాయని అన్నారు.





Total views : 90069