ఏపీ ఎన్నికలకు టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో (NDA Manifesto) విడుదల చేసారు. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, బీజేపీ ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీయే హామీల్లో ముఖ్యమైనవి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితం.. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేత.. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి.. ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.. ‘తల్లికి వందనం’ కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
- నెల్లూరు జిల్లాలో మామిడి తోటలో అగ్నిప్రమాదం.నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీ పరిధిలోని వెంకటేశపురం మామిడి తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మామిడి తోటలో ప్రారంభమైన మంటలు క్రమంగా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీగా పొగలు కమ్ముకోవడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన…
- రామచంద్రపురంలో ఘనంగా జయహో బీసీ కార్యక్రమం.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జయహో బీసీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీసీల రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీసీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రామచంద్రపురం నుంచి పసలపూడి జంక్షన్ వరకు…