కడప జిల్లా… జమ్మలమడుగు లోని బిజెపి కార్యాలయంలో మాజీ మంత్రి జమ్మలమడుగు బిజెపి శాసనసభ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి (Adinarayana reddy) విలేకరుల సమావేశం నిర్వహించి వైకాపా నాయకులపై నిప్పులు చేరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైకాపా నేతలు సహజ వనరులను కొల్లగొడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. జగన్ పై జరిగిన ప్రతి దాడిని తనపై ఆరోపణలు చేశారని ఆ దాడులు చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసు అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను వెనకేసుకువస్తు అన్యాయాలకు వంతపడుతున్నారని వివరించారు. జమ్మలమడుగులో అభివృద్ధి పనులు, హెల్త్ క్యాంపులు తాను చేశానని, ఈ నాయకుడు ఏ అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం ఉన్న నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై ఆరోపణలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తన సొంత బావమరిది సూర్యనారాయణ రెడ్డి వైకాపా నేత అవినాష్ రెడ్డిని గెలిపిస్తాను అనడం హాస్య స్పందనముగా ఉందన్నారు. తమ సపోర్ట్ లేకుండా వార్డులలో కూడా తిరగలేని వ్యక్తి వైకాపాను గెలిపిస్తాం అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. సూర్యనారాయణ రెడ్డి కోసం తాము అనేక త్యాగాలు చేశామని ప్రస్తుతం ఆయన తమ నాశనం కోరుతున్నాడని ఇది సరైన పద్ధతి కాదని సూర్యనారాయణ రెడ్డి పై నిప్పులు చేరిగారు. అమిత్ షా జమ్మలమడుగు నియోజవర్గానికి ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు అన్నారు. ఈనెల 25వ తేదీన జమ్మలమడుగులో జరిగిన ర్యాలీ సక్సెస్ అయిందని ఈ సక్సెస్ తో తన గెలుపు ఖరారు అయినట్టేనని ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
- దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…




Total views : 212638