రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కాపుల సంక్షేమన్ని పూర్తిగా అటకేక్కించింది అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో 1.50 కోట్లతో ఆధునీకరించిన తెలగ కల్యాణ మండపం ను మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప తో కలసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ కు కేటాయించ వలసిన నిధులు కేటాయించలేదని విదేశీ విద్యను పూర్తిగా అటకెక్కించారని వచ్చే టిడిపి జనసేన రావడం అధికారులకు వచ్చిన వెంటనే అభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు కాపుల విదేశీ విద్య పునరుద్దిస్తామని ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాకముందు కాపు కార్పొరేషన్ కు సంవత్సరానికి రెండూవేల కోట్లు కేటాయిస్తానని ఒక్క రూపాయి విడుదల చేయలేదన్నారు. అలాగే ఐదు శాతం రిజర్వేషన్ జీవోను దుయ్యబట్టారు రానున్న టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో కాపుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ వెనుకబడిన కులాల వారికి ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ లో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ టిడిపి ప్రభుత్వం జీవో విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదని కాపులు అందరూ రిజర్వేషన్ కోసం ఐక్యంగా పోరాడాలని కోరారు.
ysrcp
తిరుపతిలో స్థానిక 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు రెడ్డి టిడిపి పార్టీకి రాజీనామా చేసి, వైఎస్సార్ సీపీలో చేరగా.. తిరుపతి ఎమ్మెల్యే హోదాలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీ రాములురెడ్డి ఆదివారం ఉదయం ముత్యాల రెడ్డి పల్లి నుంచి భారీ ర్యాలీతో పద్మావతి పురంలోని భూమన నివాసానికి చేరుకుని వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడారు…మన జీవితాల్లో వెలుగులు నింపుతున్న జగనన్నకే మద్దతు ఇద్దాం అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకే ఓట్లు వేసి, జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం అని పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పేద ప్రజలకు చేసిందేమీ లేదని, అయినా, అధికారం కోసం చంద్రబాబు అండ్ కో మళ్లీ ఓట్లు అడిగేందుకు మీ ముందుకొస్తారు, తస్మాత్ జాగ్రత్త అని ప్రజలను హెచ్చరించారు. జగనన్న చేయూత తోనే తిరుపతి అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిందని, పేదల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం కట్టుబడి ఉందని పార్టీలో చేరిన వారందరూ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోవు రోజుల్లో జరిగే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
Read Also..
గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది అంటూ పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో టిడిపి- జనసేన పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. దాచేపల్లి పట్టణం నుంచి కేసానుపల్లి వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎటువంటి రోడ్లు వేయలేదన్నారు. దీంతో రోడ్లన్నీ గుంతలమయం అయిపోయాయని ఎద్దేవా చేశారు. ఈ గుంతల రోడ్ల మీద ప్రయాణిస్తూ , ఎంతో మంది యువకులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి తన బిడ్డను చూడటానికి వెళ్తూ… రోడ్డు ప్రమాదంలో మరణించాడని, ఇలా ఏన్నో కుటుంబాలు ప్రమాదం బారిన పడి రోడ్డున పడ్డాయన్నారు. ఇప్పటికైనా ఈ కళ్ళు లేని కబోది , మూగ వైసీపీ ప్రభుత్వం రోడ్లని బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ – టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయులు, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇరు పార్టీలు కలిసికట్టుగా చెయ్యవలసిన రాజకీయ ప్రయాణం గురించి, ప్రజల సమస్యల గురించి చర్చించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాష్టీకాన్ని నిలువరిస్తూ… భవిష్యత్ కి మా గ్యారెంటీ అని భరోసా ఇచ్చి, గడప గడపకు ఉమ్మడి ప్రచార కార్యాచరణ నిర్వహించడం ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమన్నారు. నేరేళ్ల సురేష్ గారు మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, ఇరు పార్టీలు కలిస్తే 2014 ఎక్కడ పునరావృతం అవుతుందని అధికార పార్టీ నాయకుల్లో అలజడి మొదలయ్యిందన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో తీవ్ర ఉద్రిత పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించాడనికి వెళ్లిన హోం మంత్రి తానేటి వనిత ను దొమ్మేరు గ్రామస్థులు అడ్డుకుని గంటన్నరపాటు రోడ్డుపైనే ఘెరావ్ చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు బొంతా మహేంద్ర కుటుంబాన్ని పరామర్శించి, పరిహారం ఇచ్చేందుకు వెళ్లిన హోం మంత్రిని రోడ్డుపైన నిలదీశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ గెలుపుకు కృషి చేస్తే.. మాకు చావును బహుమానంగా ఇస్తారా? మహేంద్రను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని చెప్పినా పట్టించుకోని మీరు.. ఇప్పుడు అతను చనిపోయాక ఎందుకొచ్చారు? మేం చెప్పగానే పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేస్తే మహేంద్ర ప్రాణాలు పోయేవా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మృతుడు మహేంద్ర కుటుంబసభ్యుల్ని పరామర్శించి, పరిహారం అందించేందుకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో కలిసి హోం మంత్రి వనిత దొమ్మేరుకు వెళ్లారు. నాగార్జున, వెంకట్రావులను బాధితుడి ఇంటి వద్దకు వెళ్లేందుకు అంగీకరించిన దొమ్మేరు ఎస్సీ పేట యువత, మహిళలు.. వనిత వాహనాన్ని మాత్రం అడ్డుకుని ఆమెను రోడ్డుపైనే ఆపేశారు. పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా.. మా గ్రామంలోకి మీరొచ్చింది కాక మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులపైకి కుర్చీలు విసిరేశారు. మరోవైపు బాధిత కుటుంబం ఇంటికి వెళ్లిన మంత్రినాగార్జున, వెంకట్రావు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు, వైసీపీ నాయకుడి తరఫున రూ.10 లక్షల చెక్కు అందించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌లో నిప్పులు పోశారని, ఈ రెండింటిని చూస్తే ఎంతో బాధ కలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని అభివృద్ధి చేయగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి దూరదృష్టి ఉన్న నాయకుడికి ఈసారి పట్టాభిషేకం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఏపీకి రెండోసారి సీఎం అయ్యి ఉంటే రాజధాని అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేవారని అన్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ అర్హులైన మత్స్యకారులకు సీఎం చేతులు మీదుగా సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల భవిష్యత్ కు భరోసాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ఉందన్నారు. పులికాట్ ముఖద్వారం పూడికతీత కు 142 కోట్లు ఖర్చుచేసామన్నారు. మత్స్యకారుల ఆరాధ్యదైవం మన సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 21న జరిగే సభలో నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
Read Also…
వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు నాలుగున్నర సంవత్సరంలో పేదలు, రైతులు ఇలా ఒకరిని కాకుండా ఎవరిది పడితే వారిది అక్రమంగా భూములు లాక్కొని తమ బినామీలకు సొంతం చేశారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపించారు టిడిపి శ్రీకాళహస్తి ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని అన్ని మండలాలలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తమ అనుచరులతో బినామీల రూపంలో కోట్లకు పడగలెత్తారని, పేద రైతుల డీకేటీ పట్టాలు ఉన్న వాటిని రైతులను బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి తమ అనుచరుల పేరుమీద అక్రమంగా రాయించుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క రేణిగుంట మండలంలోనే దాదాపు 500 కోట్లకు పైగా భూకబ్జాకు పాల్పడ్డారని ఆధారాలతో సహా తమ వద్ద ఉన్నాయని అన్నారు. ఇందులో అధికారులకు అందరికీ పాత్ర ఉందని దీనిపై ప్రజలు ముందుకు వచ్చి పోరాడితే కానీ న్యాయం జరగదని, మీడియాను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని మండి పడ్డారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వల్ల ఏమాత్రం అభివృద్ధి జరగడంలేదని విమర్శించారు . ఆశించిన స్థాయిలో పనులు జరగడంలేదని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ నేతలు విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. వైసీపీ నేతలు ఆమెను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పురందేశ్వరిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో స్పందించారు. చెల్లెమ్మా పురందేశ్వరీ… జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని, మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా? అంటూ నిలదీశారు. భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? అని ప్రశ్నించారు.
పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి కలిసి తమ వ్యాపార దోపిడీ కేంద్రంగా మార్చారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ఈవో ధర్మారెడ్డిని ఇటీవలే సీఎం జగన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ధర్మారెడ్డిగా మార్చాడని ఆరోపించారు. ఢిల్లీలో ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న ధర్మారెడ్డిని జగన్ రెడ్డి ఏరికోరి రాష్ట్రానికి తీసుకొచ్చాడని, అసలు అతనికి టీటీడీ అధికారిగా పనిచేసే అర్హత ఉందా అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆనం వెంకట రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గతంలో వైఎస్ఆర్ సీఎం అయ్యాక ధర్మారెడ్డిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నియమించారని అప్పటి నుంచి ఆయన మరణించే వరకు కొనసాగారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణం అనంతరం ధర్మారెడ్డి తిరిగి డిఫెన్స్ సర్వీసులకు వెళ్లిపోయాడని గుర్తు చేశారు. ఇదే ధర్మారెడ్డి తిరిగి జగన్ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంపై వాలిపోయాడని విమర్శించారు. ఢిల్లీలో ఉన్న ధర్మారెడ్డిని డిప్యుటేషన్ పై ఏపీకి పంపాలని జగన్ మోడీకి లేఖ రాయడం ఓకే చెప్పడం చకచకా జరిగిపోయిందని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.