Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లనని స్పష్టం చేసిన మీనాక్షి నటరాజన్.

తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లనని స్పష్టం చేసిన మీనాక్షి నటరాజన్.

by CVR NEWS
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లనని స్పష్టం చేసిన మీనాక్షి నటరాజన్

మధ్యప్రదేశ్‌లో తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో తెలంగాణ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారన్న ప్రచారాన్ని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఖండించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ మూడో రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునేందుకు ఫౌల్ గేమ్‌కు పాల్పడిందని ఆరోపించారు.రిటర్నింగ్ అధికారి, ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాయని ఆరోపించిన ఆమె.. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, కేవలం నోటీసు మాత్రమే వచ్చిందన్నారు. ప్రీ-కాగ్నిజెన్స్ దశలో ఉన్న కేసును ఫామ్-26లో పేర్కొనాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు చెప్పారని వివరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: