రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామంలో గ్రామకంఠం భూమి పరిరక్షణ కోసం గ్రామస్తుల ఆందోళన ఉధృతమైంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వివిధ రాజకీయ, ప్రజా సంఘాల మద్దతు లభిస్తోంది. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. గ్రామకంఠం భూమితో పాటు బతుకమ్మ కుంట కూడా ఆక్రమణకు గురైందని, దీంతో గ్రామ సంప్రదాయాలు దెబ్బతింటున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియల నిర్వహణకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి 120 గజాల ఇంటి స్థలం కేటాయించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన స్థలాన్ని గ్రామకంఠం భూమిలోనే కేటాయించాలని గ్రామ పెద్దలు డిమాండ్ చేశారు. ఆక్రమణలను తొలగించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.
దండు మైలారంలో గ్రామకంఠం భూమి పరిరక్షణకు రిలే దీక్షలు.
222
previous post