సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల మహోత్సవాలకు పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. బోనాల ఏర్పాట్లపై నిర్వహించిన కో-ఆర్డినేషన్ సమావేశంలో అధికారులు భక్తుల సౌకర్యానికి ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. బోనాలతో వచ్చే మహిళల కోసం రెండు ప్రత్యేక క్యూలైన్లు, సాధారణ భక్తుల కోసం రెండు జనరల్ లైన్లు, పాస్‌దారుల కోసం మరో రెండు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జోగినీలకు బాట నుంచి అనుమతి కల్పించనున్నట్లు వెల్లడించారు. రంగం కార్యక్రమం సందర్భంగా స్వర్ణలతకు ప్రత్యేక భద్రత కల్పించనున్నారు. ఈ నెల 31 నుంచి 10 క్రైమ్ టీమ్‌లు విధుల్లో ఉండి అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచనున్నాయి. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతూ, వీఐపీలు వచ్చినా సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఉజ్జయిని మహంకాళి బోనాలకు పోలీసుల విస్తృత ఏర్పాట్లు .
183
previous post