Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Latest News మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం-సీఎం రేవంత్ రెడ్డి.

మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం-సీఎం రేవంత్ రెడ్డి.

by CVR NEWS
మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం-సీఎం రేవంత్ రెడ్డి

మహిళల అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరెన్ని కుట్రలు చేసినా సాగనీయబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 553 ఆర్టీసీ బస్సులు పంపిణీ చేసిన సందర్భంగా వరుణదేవుడు కటాక్షం కూడా స్వయం సహాయక సంఘాలకు అభివృద్ధిని తోడైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్వయం సహాయక బృందాలకు 553 ఆర్టీసీ బస్సులు పంపిణీ చేసిన సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన మహిళాశక్తి సభలో సీఎం ప్రసంగించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి 10,500 కోట్లు చెల్లించామన్న సీఎం….మహిళలకు ఇవ్వాల్సిన రూ.4వేల కోట్ల సున్నా వడ్డీ నగదును గత ప్రభుత్వం ఎగవేసిందన్నారు.మహిళలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉంటుందా? అన్న సీఎం.. మహిళలతో పెట్టుకున్నందుకే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓడిపోయిందన్నారు.

అంబానీ, ఆదానీలకు పోటీగా పెట్రోల్‌ బంకులు, సోలార్‌ విద్యుత్‌ను రాష్ట్ర మహిళలు నిర్వహిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.త్వరలోనే మహిళా శక్తి భవనాలు నిర్మిస్తామన్న ఆయన.. హైటెక్‌సిటీ పక్కన రూ.వెయ్యికోట్ల భూమిని మహిళా సంఘాలకు ఇచ్చామని వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: