Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home International గాజాలో బయటపడ్డ అతి పెద్ద భారీ సొరంగం..

గాజాలో బయటపడ్డ అతి పెద్ద భారీ సొరంగం..

by
huge tunnel

గాజాలో అతిభారీ సొరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. సరిహద్దు వద్ద ఎరెజ్ క్రాసింగ్‌కు 400 మీటర్ల దూరంలో దీన్ని గుర్తించినట్టు వెల్లడించింది. చిన్న వాహనాలు సునాయసంగా ప్రయాణించేంత పెద్దదిగా ఈ సొరంగం ఉందని వివరించింది. ఈ సొరంగం నిర్మాణానికి కొన్నేళ్లు పట్టి ఉండొచ్చని, భారీగా నిధులు ఖర్చైఉండొచ్చని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది. అక్టోబర్ 7 దాడుల సూత్రధారి, హమాస్ చీఫ్ సోదరుడు మహ్మద్ యాహ్యా ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించినట్టు సైన్యం వెల్లడించింది. సొరంగంలోని గోడలు కాంక్ట్రీట్‌తో చేశారని, నేలమాత్రం మట్టితో సిద్ధం చేశారని పేర్కొంది. ఈ సొరంగం తాలూకు వీడియోను కూడా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. సొరంగంలో భారీ ఎత్తున ఆయుధాలు కూడా లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

019220
Total views : 90114

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.