తెలంగాణకే వెలుగునిచ్చే సింగరేణి సంస్థ లోని బ్లాకులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తుందని, వెంటనే ఆ వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.
ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ బొగ్గు గనులపై గుర్తింపు కార్మిక సంఘంతో పాటు సిఐటియు ఆధ్వర్యంలోబొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని కార్మిక సంఘాల నిరసన …, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రైవేటీకరణ చేయడం లేదంటూనే కేంద్ర సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని నినాదాలు చేశారు. బొగ్గు బ్లాక్ లను వేలం వేసే ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ… గతంలో ఏ ప్రభుత్వం తీసుకొని నిర్ణయం మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాక్ లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి కార్మికులను నడ్డి విరిచే ప్రయత్నం చేస్తుందన్నారు. అలాంటి ప్రయత్నాలు విరమించుకోవాలని, లేదంటే ఎంతటి పోరాటాల కైనా సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి