Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన..!

ఏపీ సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన..!

by Satya
CM Chandrababu

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 25, 26 తేదీల్లో చంద్రబాబు రెండురోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించడం ఇదే ప్రథమం
తన పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను ఆయన కలవనున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తనపై నమ్మకం ఉంచి మరొకసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలపనున్నారు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 8వ సారి విజయం సాధించారు. నాడు చంద్రగిరిలో ఓటమి తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు 1989 నుంచి ఇక్కడ ఎదురులేని ప్రస్థానం కొనసాగిస్తున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
    నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్‌ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా…
  • జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.
    జనరిక్‌ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్‌ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్‌ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
  • సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
    ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Advertisements

You may also like

Our Visitor

042284
Total views : 223763

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: