Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Latest News తిరుమల శ్రీవారి ఆన్ లైన్ బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు

తిరుమల శ్రీవారి ఆన్ లైన్ బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు

by CVR NEWS

శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల జారీ విధానంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై విరాళం, దర్శనం టికెట్లకు వేర్వేరుగా కాకుండా ఒకే లావాదేవీలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో భక్తులు మొదట 10 వేళ విరాళం చెల్లించి, ఆ తర్వాత 500 రూపాయలు చెల్లించి దర్శనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉండేది. ఈ ప్రక్రియలో విరాళం చెల్లింపు విజయవంతమైనా, సాంకేతిక కారణాల వల్ల దర్శనం టికెట్ ఖరారయ్యేలోపే కోటా పూర్తవడంతో చాలామంది ఇబ్బంది పడేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ, విరాళం 10 వేలు, టికెట్ ధర 500 కలిపి మొత్తం 10 వేల 5 వందలు ఒకేసారి చెల్లించేలా మార్పులు చేసింది. ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ కోటా కింద టీటీడీ ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు 8 వందల శ్రీవాణి టికెట్లను విడుదల చేస్తోంది. భక్తులు ఒకే లావాదేవీలో గరిష్టంగా నాలుగు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్‌తో పాటు, మూడు నెలల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా తిరుమల ప్రతినిధి మహేష్ అందిస్తారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: