246
తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాలతో గత ఏడాది ఆరు వేల ఐదు వందల మంది చనిపోయారన్నారు. అందుకే ప్రమాదాలు జరగకుండా రోడ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. మా ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బకాయిలను కూడా మా ప్రభుత్వం వచ్చిన తరువాత చెల్లించిందన్నారు. అర్బన్ , ఇండస్ట్రియల్ రోడ్ల విస్తరణ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.