Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home International వీసా లేకుండానే భారతీయ పర్యాటకులకు మలేసియా ఎంట్రీ

వీసా లేకుండానే భారతీయ పర్యాటకులకు మలేసియా ఎంట్రీ

by Satya
Visa-free entry to Malaysia for Indian tourists

విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మలేసియా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పించింది. చైనా పౌరులకు కూడా ఈ ఆఫర్ కల్పించింది. డిసెంబర్ 1 నుంచి భారతీయులు, చైనీయులు వీసా లేకుండానే తమ దేశానికి రావొచ్చని మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. 30 రోజులపాటు దేశంలో గడపొచ్చని వివరించారు. ఈ మేరకు ఆదివారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వివరాలు చెప్పారు. భద్రతకు సంబంధించిన స్క్రీనింగ్ మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. విదేశీ పర్యాటకులు, ఇన్వెస్టర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా వీసాతో ముడిపడిన ప్రక్రియను సులభతరం చేయాలని యోచిస్తున్నట్టు గత నెలలోనే ప్రధాని అన్వర్ పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్, చైనా దేశాల పర్యాటకులకు ఈ సౌకర్యాలను కల్పించనున్నట్టు చెప్పారు. దేశంలోకి పర్యాటకుల సంఖ్య పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇస్తుందని మలేసియా ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

025457
Total views : 147302

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.