Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Technology బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫ్యాన్సీ నెంబర్‌ కావాలా..?

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫ్యాన్సీ నెంబర్‌ కావాలా..?

by Satya
BSNL

బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లు ఫ్యాన్సీ నెంబర్లు కావాలంటే ఆన్‌లైన్‌లో సులభంగా సొంతం చేసుకోవచ్చు. భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ (BSNL) కస్టమర్లకు గుడ్‌న్యూస్‌. బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ కస్టమర్లు మంచి ఫ్యాన్సీ నెంబర్లను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ వేలం పాట ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండడం విశేషం. ఆసక్తిగల కస్టమర్లు ఆన్‌లైన్‌లో పాల్గొని ఫ్యాన్సీ నెంబర్‌తో కూడిన సిమ్‌ కార్డులను సొంతం చేసుకోవచ్చు. నవంబర్‌ 11 నుంచి ఈ ప్రీమియం నెంబర్ల వేలం ప్రారంభమై నవంబర్‌ 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఫ్యాన్సీ నెంబర్లు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో వేలం వేస్తున్నారు. అలాగే.. ప్రస్తుతం దేశంలో రోమింగ్ విధానం లేకపోవడంతో ఏ రాష్ట్రంలో సిమ్‌ను ఏ రాష్ట్రంలో అయినా ఉపయోగించుకోవచ్చు.

Advertisements

You may also like

Our Visitor

013883
Total views : 78295

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.