Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News ఓటింగ్ శాతం పెరిగింది,ఇది ప్రజాస్వామ్య విజయం..

ఓటింగ్ శాతం పెరిగింది,ఇది ప్రజాస్వామ్య విజయం..

by CVR NEWS
ఓటింగ్ శాతం పెరిగింది,ఇది ప్రజాస్వామ్య విజయం..

మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గూండాలను ఏరిపారేస్తామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బెంగాల్ లో రెండో దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని తృణమూల్ అక్రమాలపై విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ తొలి దశ పోలింగ్‌లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారని, ఇది ప్రజాస్వామ్య విజయంగా ప్రధాని అభివర్ణించారు. ఈ ఓటింగ్ శాతాన్ని చూసి టీఎంసీకి భయం పట్టుకుందని అన్నారు. మమతా బెనర్జీ సాగిస్తున్న అటవిక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ రాష్ట్రం విప్లవాల గడ్డ అని గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ గూండాలను ఎవరూ కాపాడలేరని అన్నారు.

ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయానికి, దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్‌ను బయటకు తీస్తామని మోదీ హెచ్చరించారు. మొదటి దశలో పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదు కావడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తోందని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. బెంగాల్‌లో మహిళలకు గౌరవం, భద్రత, సాధికారత కల్పించడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: