Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home Telangana రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది.

రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది.

by Rama
రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు.. 2 లక్షల రూపాయల వరకు రైతు పంట రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఒకే విడతలో మొత్తం 2 లక్షల రూపాయలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఐదేళ్ల మధ్య కాలంలో తీసుకున్న 2లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది.క్రాఫ్ లోన్ మాఫీ చేయడానికి 31వేల కోట్లు అవసరం అవుతుందన్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండగ అనుకునే విధంగా సాగు రంగాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. కొండలు, గుట్టలు, వెంచర్లకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అందించటానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీథర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సభ్యులుగా ఉంటారన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభలో చర్చించి.. నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: