Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana హైదరాబాద్ లో మెట్రో రెండోదశ డీపీఆర్ సిద్ధం

హైదరాబాద్ లో మెట్రో రెండోదశ డీపీఆర్ సిద్ధం

by Satya
మెట్రో రెండో దశ డీపీఆర్ సిద్ధం

హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలకూ మెట్రో సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రెండో దశలో సరికొత్త కారిడార్లను తీసుకొస్తోంది. ప్రధానంగా శివారు ప్రాంతాల ప్రజలు నగరానికి సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తోంది. మొత్తంగా తొలుత నిర్ణయించిన 78.04 కిలోమీటర్లకు అదనంగా మరో 38.16 కిలోమీటర్లను పూర్తి చేయనుంది. దీంతో ఆరు కారిడార్లలో కలిపి మొత్తం 116.2 కిలోమీటర్లను 32,237 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మెట్రో రెండో దశ పనులకు సంబంధించిన లెక్క ఖరారు చేసింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫోర్త్‌సిటీకి కూడా మెట్రోను తీసుకెళ్లనున్నారు.

ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్‌ సిటీవరకు 40 కిలోమీటర్ల కారిడార్‌గా 8 వేల కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే నాగోల్‌-ఎయిర్‌పోర్టు అలైన్‌మెంట్‌కు సంబంధించి డీపీఆర్‌లో స్వల్పమార్పులు చేశారు. మొదట ప్రతిపాదించిన నాగోలు, ఎల్‌బీనగర్‌ వయా చాంద్రాయణగుట్ట క్రాస్‌ రోడ్డు- మైలార్‌దేవ్‌పల్లి-పీ7 రోడ్డు-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు 29 కిలోమీటర్లకు బదులుగా నాగోలు నుంచి చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆరాంఘర్‌, న్యూహైకోర్టు, శంషాబాద్‌ జంక్షన్‌ ద్వారా ఎయిర్‌పోర్టుకు కారిడార్‌ను నిర్మించేందుకు డీపీఆర్‌ను రూపొందించారు.ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇటీవల పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా డీపీఆర్‌ అంశాలను తెలియజేశారు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019147
Total views : 89993

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.