శ్రీకాకుళం జిల్లా పలాస లో సామాజిక సాధికారిక యాత్ర లో స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్ పేదరికం, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి అడ్డు రాకూడదు. నాలుగేళ్లలో పేదల కు అండగా ఉండి పథకాలు అందించడం జరిగింది. పేదవాడు నేడు తలెత్తి దైర్యం గా బతికేలా చేశాం. విద్య లో ఇంగ్లిష్ మీడియం వద్దని కొందరు కోర్టు కి వెళ్లారు. కానీ వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదువుకోవాలి పేద వారికి ఇంగ్లీష్ వద్దు అన్నారు కొందరు. పలాస లాంటి ప్రాంత వాసి కి ఇంగ్లిష్ వస్తే ఇంటర్వ్యూ దైర్యం గా ఫేస్ చేయగలరు. వైద్యం పై లక్షలు వెచ్చించి పేదలకు పైసా ఖర్చు లేకుండా చేస్తున్నాము. పిల్లలు జగన్ మామ అంటున్నారు. ఆరోగ్యశ్రీలోనే వేగంగా ఆపరేషన్లు అవుతున్నాయి. హైదరాబాద్ అయినా విజయవాడ అయినా ఆరోగ్యశ్రీ పేరున ఆపరేషన్ జరుగుతున్నాయి. పేదల ఇంటిలోకి వెళితే దేవుళ్ళుగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి వాళ్లే మా దేవుళ్ళు అంటున్నారు. రాష్ట్రంలో గతంలో సామాజిక వర్గాల్ని అట్టడుగు కు వుండేవి. జగన్ వచ్చాకే సామాజిక వర్గాలన్నీ లేచి నిలబడ్డాయి. జగన్ వల్ల సామాజిక సాధికారిక యాత్ర వల్ల మన సామాజిక విజయ శంఖారావం మ్రోగింది. ఇప్పుడు జరుగుతుంది పెత్తందారి సామాజిక వర్గాల యుద్ధం. ఈ యుద్ధంలో మనం గెలవాలి. మనం గెలవాలంటే బ్యాలెట్ యుద్ధంలో జగన్ గెలిపించాలి. ఇది మన ఆత్మగౌరవ యాత్ర మనం తలెత్తుకు తిరిగే పరిస్థితి జగన్ కల్పించారు. జగన్ బటన్ నొక్కితే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గతంలో జన్మ భూమి కమిటీ లాగ లంచాలు లేవు కుల ,, మత,పార్టీ బేధం లేదు అందరికీ అందించాం.
సాధికారిక యాత్ర లో తమ్మినేని కామెంట్స్..
103