Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh ఎవరు? ఎందుకు? ఏం ఆశించి?

ఎవరు? ఎందుకు? ఏం ఆశించి?

by Prakash
AP Police reached Sagar at midnight

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. అర్ధరాత్రి సమయంలో సాగర్‌ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, సాగర్‌ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు రాగా.. తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షన వాతావరణం చోటుచేసుకుంది. తాజాగా.. ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. పోలింగ్‌కు ముందురోజు సెంటిమెంట్‌ను రగిల్చేలా వ్యూహాత్మకంగానే వివాదం సృష్టించారని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరు? ఎందుకు? ఏం ఆశించి? ఈ ప్రయత్నాలు చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుంది. నీళ్లు ఎక్కడికి పోవు. దీనిపై పోలింగ్‌కు ముందు రోజు అర్ధరాత్రి వివాదం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇది కచ్చితంగా కుట్రలో భాగమే అని తెలిపారు. ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించవు అని తేల్చి చెప్పారు.

Advertisements

You may also like

Our Visitor

039692
Total views : 199276

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: