Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Telangana కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

by Satya
ktr

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చారని, రేవంత్ ప్రతి మాటకు మా వద్ద రికార్డ్ ఉందన్నారు. ఆయనను తాము ఎందుకు వదిలి పెడుతామని కేటీఆర్ ప్రశ్నించారు. స్పీకర్ నామినేషన్ సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అధికారంలోకి రాగానే 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ చెప్పారు కదా అని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే పెన్షన్ 4 వేల రూపాయలు ఇస్తామన్నా, కేటీఆర్ 10 రోజులు ఆగండి 15 రూపాయలు వేలు రైతు భరోసా ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదన్నారు. తొలి కేబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు, ఏదీ అని ఆయన నిలదీశారు. రుణ మాఫీకి మేం ఎంత ఇబ్బంది పడ్డామో తమకు తెలుసన్నారు. ఎవరైనా అధికారంలోకి రాకముందు ఆదాయ లెక్కలు చూసుకుంటారని, కాంగ్రెస్ వారు మాత్రం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు చూసుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉండగా చేసిన ప్రతి అప్పుకూ ఆడిట్ రిపోర్ట్ ఉందన్నారు. కాంగ్రెస్ వారు చూసుకోకపోతే తమకేం సంబంధం? అని కేటీఆర్ ప్రశ్నించారు.

Advertisements

You may also like

Our Visitor

039507
Total views : 197340

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: