Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh రేపటి నుంచి కేంద్ర ఎన్నికల పర్యటన

రేపటి నుంచి కేంద్ర ఎన్నికల పర్యటన

by Satya
Central election

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం రేపటి నుంచి మూడు రోజులపాటు పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఇతర కమిషనర్లు విజయవాడ చేరుకోనున్నారు. సీఈసీ బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ టూర్ లో రాష్ట్రంలోని వివిధ పార్టీలతో సీఈసీ రాజీవ్ కుమార్ బృందం భేటీ కానుంది. అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతపై జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. సీఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ అవుతారని అధికారులు తెలిపారు. సమావేశం పూర్తయ్యాక సీఈసీ బృందం ఢిల్లీకి తిరిగి వెళుతుందని పేర్కొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039612
Total views : 198703

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: