Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra PradeshWest Godavari ఊరు వెళ్తున్న.. రక్షణ కల్పించండి..

ఊరు వెళ్తున్న.. రక్షణ కల్పించండి..

by Rama
Raghuramakrishna Raju

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంక్రాంతికి తమ ఊరు వెళ్తానని.. రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే పోలీసులు రఘురామపై 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం ఉందని ఆయన తరఫున న్యాయవాదులు ఉమేష్‌ చంద్ర, వై.వి. రవిప్రసాద్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారు. మరోసారి తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశముంది. పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వండి అని కోర్టును అభ్యర్థించారు. ఆర్నేష్‌ కుమార్‌ కేసులో 41ఏ నిబంధనలు పాటించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. రఘురామకృష్ణరాజు పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. కేసు నమోదై, ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు అయితేనే 41ఏ నిబంధనలు వర్తిస్తాయన్నారు. తాజాగా ఆయనపై ఎలాంటి కేసులు పెట్టలేదని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం నేడు ఉత్తర్వులు ఇవ్వనుంది.

Advertisements

You may also like

Our Visitor

019142
Total views : 89968

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.