Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News బొగ్గు గనుల ఆకస్మిక తనిఖీ…

బొగ్గు గనుల ఆకస్మిక తనిఖీ…

by Prakash
Sudden Inspection of Coal Mines...

సింగరేణి కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సంస్థ సి అండ్ ఎండి బలరాం అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా సింగరేణి బొగ్గుగనులను అర్జీ 1 జిఎం శ్రీనివాస్ తో కలిసి సందర్శించారు. ఓసిపి 3 ప్రాజెక్ట్ తో పాటు జిడికే 2వ బొగ్గు గనిలో పని స్థలంలోకి వెళ్లి కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని కార్మికులకు సూచించారు. కార్మిక కుటుంబాలకు తాగునీటితో పాటు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపడుతన్నట్లు పేర్కొన్నారు. కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే కార్మిక కుటుంబాలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: