Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం…

తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం…

by Prakash
A grand Parveta festival in Tirumala

శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవము మంగళవారం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా మంగళవారం మ‌ధ్యాహ్నం 1 గంట‌కు శ్రీ మలయప్పస్వామి వారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంట మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణ స్వామి వేంచేసారు. అనంతరం పార్వేట మండపము నందు పుణ్యాహము, ఆరాధన, నివేదనము జరిగి హారతులు జరిగాయి. అనంత‌రం ఉభయదార్లకు తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు జరిగాయి. శ్రీ కృష్టస్వామివారిని సన్నిధి యాద‌వ పూజ చేసిన చోటుకు వేంచేపు చేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. తరువాత శ్రీ మలయప్ప స్వామి వారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణము వేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఇట్లు మూడుసార్లు జరిగింది. శ్రీ మలయప్ప స్వామి వారు ఉత్సవము పూర్తయి మహాద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పార్వేట ఉత్సవము ఘనంగా ముగిసింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: