Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కుల పంపిణీ…

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కుల పంపిణీ…

by Prakash
Bolla Brahmanaidu

పల్నాడు జిల్లా వినుకొండలో అర్హులైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కుల పంపిణీ చేశారు. వినుకొండ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా నియోజకవర్గ పరిధిలోని 7మంది బాధితులకు వచ్చిన 10 లక్షల 15 వేల రూపాయల అందజేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ… అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్ధిక స్థోమత లేని పేదలను, ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకోవడం జరిగింది అన్నారు. ఆరోగ్య శ్రీ అనుమతులు ఉన్న వైద్యశాలలోనే చికిత్స చేయించుకోవాలని అన్నారు. చాలా రకాల వ్యాధులను నేడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చడం జరిగిందని, అన్ని వైద్య సౌకర్యాలు, ఆయా విభాగాల్లో నిపుణులు ఉన్నటువంటి ఆసుపత్రులకు మాత్రమే ఆరోగ్యశ్రీ అనుమతులు ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రజలు గమనించి ఆరోగ్యశ్రీ అనుమతి ఉన్న ఆసుపత్రిలో చికిత్సను పొందవలసినదిగా కోరారు. ఆరోగ్యశ్రీ ఉండి కూడా ఆసుపత్రి యాజమాన్యం వారు నగదును డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకొని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుతో పాటుగా నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: