Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh రాజధాని రైతులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట

రాజధాని రైతులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట

by Satya
A big relief for capital farmers in AP High Court


రాజధాని అమరావతి రైతులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులను ఏపీ హైకోర్టు నేడు కొట్టివేసింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ప్లాట్లను రద్దు చేశారు. ప్లాట్లను రద్దు చేస్తున్నట్టు సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు 862 మంది రైతులకు నోటీసులు ఇచ్చారు. దాంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్లాట్ల రద్దు అన్యాయం అంటూ ప్రభుత్వ నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు.

ఇది చదవండి: కృష్ణా జలాల విడుదల పై టీడీపీ నేతలు ఆరోపణ

ప్లాట్లు రద్దు చేయడం అంటే సీఆర్డీయే చట్టాన్ని ఉల్లంఘించడమేనని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టు ధర్మాసనానికి విన్నవించారు. ప్లాట్ల రద్దు నిర్ణయం రాజధాని మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకం అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ చట్టంలో మార్పులు చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం రాజధాని రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన ప్లాట్ల రద్దు నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది.

Follow us on : Facebook, Instagram & YouTube.


నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక …
ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: