Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Film మార్చి 22న అనన్య మూవీ గ్రాండ్ రిలీజ్..

మార్చి 22న అనన్య మూవీ గ్రాండ్ రిలీజ్..

by Rama
Ananya Movie

అనన్య మూవీ (Ananya Movie)

జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ముఖ్య తారాగణంగా ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వంలో… శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకం ప్రారంభ చిత్రంగా జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించిన విభిన్న కథా చిత్రం “అనన్య”. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదల (Release) కానుంది. ఈ నేపధ్యంలో “అనన్య” ప్రచార చిత్రాన్ని శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ ఆవిష్కరించి, ఈ చిత్రం ఘన విజయం సాధించాలని అభిలషించారు!!

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరించి తమ “శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్”కు శుభారంభాన్నిస్తుందని నిర్మాత జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ పేర్కొన్నారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా అందుకుని, ఈనెల 22న వస్తున్న “అనన్య” ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం పుష్కలంగా పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడీ తెలిపారు. తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్ కు దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు!!

ఇది చదవండి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా “నాయక్” రీ రిలీజ్

సీతా శ్రీనివాస్, శివాని శర్మ, చక్రవర్తి, జబర్దస్త్ అప్పారావు, పొట్టి చిట్టిబాబు, సుజాత, క్రాక్ శ్రీమణి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, డాన్స్: బ్రదర్ ఆనంద్ – బాలు, ఫైట్స్: దేవరాజ్, మ్యూజిక్: త్రినాద్ మంతెన, కెమెరా: ఎ.ఎస్.రత్నం, ఎడిటింగ్: నందమూరి హరి, సహ నిర్మాత: బుద్ధాల సత్యనారాయణ, సమర్పణ; శ్రీమతి జంధ్యాల రత్న మణికుమారి, నిర్మాత: జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ప్రసాద్ రాజు బొమ్మిడి!!


గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..
ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి …
తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..
ప్రముఖ తమిళ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు కె. రాజన్ ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని అడయార్ …
దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..
టాలీవుడ్ లో పావలా శ్యామల స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె చివరి రోజుల్లో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014681
Total views : 80820

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.