Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh కోటప్ప కొండ ఏర్పాట్ల స్టోరీ…

కోటప్ప కొండ ఏర్పాట్ల స్టోరీ…

by Prakash
Kotappakonda

కోటప్ప కొండ (Kotappakonda) :

పల్నాడు జిల్లా, నరసరావు పేట మండలంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోటప్ప కొండ శైవక్షేత్రం గురించి తెలియని వారు ఉండరు. ప్రసిద్ధి చెందిన ప్రముఖ శైవక్షేత్రాలలో కోటప్ప కొండ శైవక్షేత్రం ఒకటిగా విరజిల్లుతుంది. త్రికుటచల నామస్మరణతో మోక్షదాయం సిద్ధిస్తుందని సాక్షాత్తు అగస్త్య మహాముని వర్ణించారు. పావన కృష్ణ నది తీరాన దక్షిణ భాగాన యల్లమంద, కొండకావురు మధ్య గల పర్వత రాజే ఈ త్రికుటచలం.

ప్రతి ఏడాది కోటప్ప కొండ తిరినాళ్లకు లక్షలాది మంది భక్తుల రాకతో కోటప్పకొండ శివనామ స్పరణతో మారుమోగుతుంది. కోటప్ప కొండలో నిర్వహించే మహా శివరాత్రి తిరునాళ్ల 2008 లో రాష్ట పండుగ హోదా సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం అనేకమంది భక్తులు కోటప్ప కొండ తిరినాళ్లకు తరలి వస్తారు. వేసిన పంట చేతికి రావాలని రైతులు, కోరుకున్న కోరికలు నెరవేరాలని భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. గతంలో 2 నుండి 5 లక్షల వరకు మాత్రమే భక్తులు వచ్చే వారు ప్రస్తుతం ఆ సంఖ్య 10 లక్షలకు చేరిందంటే త్రికుతాచలేశ్వరుడి మహత్యం ఏపాటిదో అర్ధం అవుతుంది. అడుగడుగునా శివ నామస్మరణతో కోటప్ప కొండ ఆలయం నిత్యం మారుమ్రోగుతుంది.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరినాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు శాఖల అధికారులతో జరిగిన కోటప్ప కొండ తిరునాళ్లకు సంబంధించి రివ్యూ మీటింగ్ లో అన్ని శాఖల సమన్వయంతో పని చేసేందుకు కలెక్టర్ శివ శంకర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో 3 సమీక్ష సమావేశాలు పూర్తి చేశారు. తిరునాళ్లకు ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు భక్తులు కొండకు వచ్చిపోయే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 3000 వేల మంది పోలీస్ సిబ్బంది పండుగకు విధులు నిర్వహిస్తున్నారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిసి కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కొండ దిగువ భాగాన ప్రభుత్వం వారి ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాట్లు చేస్తున్నారు కొండకు వచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువ భాగం నుండి కొండ పైకి వెళ్లేందుకు బస్సులు నిత్యం తిరుగుతుంటాయని అధికారులు తెలిపారు.

స్వామి వారి దర్శనార్థం కొండకు వచ్చే భక్తుల కోసం మంచి నీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తామని ఆలయ ఈ వో గొల్లమారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు ముందుకు వచ్చి మంచి నీటితో పాటు పులిహోర ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు. అదే విధంగా చిన్నపిల్లలకు బిస్కెట్లు, పాలు సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెట్ల మార్గం నుండి వచ్చే భక్తుల కోసం చలి వేంద్రాలు అలాగే ఘాటు రోడ్డు నుండి నడుచుకుంటూ వచ్చే భక్తుల కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని, కొండకు తరలి వచ్చే భక్తుల కోసం 2 లక్ష 50 వేల లడ్లు, 1 లక్ష అరిసెలు సిద్ధం చేశామని ఆలయ ఈ వో తెలియచేసారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎండ తగలకుండా తాటాకు పందిర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి : మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి…

మహా శివరాత్రి పండుగ రోజున త్రికోటేశ్వరునికి ప్రత్యేక అలంకారాలతో అభిషేకాలు, పంచ హారతులు, మహా నివేదనములు, అష్టోత్తరములు, దీపోత్సవములతో స్వామి వారికి పండుగ నాడు పూజలు నిర్వహిస్తారని ఆలయ ఆర్చకులు తెలిపారు. పండుగ నాడు త్రికోటేశ్వరుని ప్రీతి ఐన ప్రభలతో అనేక గ్రామాల నుండి భక్తులు చేరుకో కోటయ్య అంటూ కోటప్ప కొండకు తరలి వస్తారు. పండుగ నాడు రాత్రి జరిగే తిరునాళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలు, అనేక రకముల వినోద భరిత ప్రదర్శనలతో కోటప్ప కొండ తిరునాళ్ల అంగరంగ వైభవంగా జరుగుతాయి.


కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. …
శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.
నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు …
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.
రాష్ట్ర మంత్రి సవిత ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023183
Total views : 141344

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.