మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలిస్తే మైనార్టీల మేలు మరవడు….
మడితాటి శ్రీనివాసులు రెడ్డి (కోడి శీనా) అన్న సాయం మూడో వ్యక్తికి కూడా తెలియదు…
ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మైనార్టీ మహిళలు కోసం చేసింది శూన్యం….
మడితాటి శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో సుమారు మూడువందల మంది మహిళా మైనార్టీలు వైసిపిని నుండి టిడిపిలో చేరిక…
చేరిన మైనార్టీ మహిళల అక్క చెళ్ళమ్మల్లకు టిడిపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..
సహాయం కోరి వెళ్లిన ఎంతో మందికి కుల, మత ప్రాంతాభిప్రాయం లేకుండా సహాయం చేసిన మన మడితాటి శ్రీనివాసులు రెడ్డి (కోడి శీనా) అధ్వర్యంలో రాయచోటి మున్సిపాల్టీ పరిధిలో కొత్తపల్లి ఐదవ వార్డు నందు సుమారు 350 కి పైగా మైనార్టీ మహిళలు పసుపు తీర్థం (తేదేపా) పుచ్చుకున్నారు. వీరికి మాజీ కో ఆప్షన్ సభ్యులు సల్లా ఉద్దీన్, మాజీ మార్కెట్ చైర్మన్ చెన్నరు అన్వర్ బాషా, జాఫర్ లతో కలిసి రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పార్టీ కండువా వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కొత్తపల్లి నీ ప్రతి ఒక సమస్యను పరిష్కరించడమే కాకుండా అభివృద్ది విషయంలో కొత్తపల్లి పై ప్రత్యేక చొరవ తీసుకుంటానని ఎమ్మెల్యే అభ్యర్థి మైనార్టీ మహిళలకు హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పదవులతో సంబంధం లేకుండా నా సహాయం కానీ, కొడి శీనా సహాయం కోరి వచ్చిన వారికి మ వంతుగా ఆర్థిక సహాయం చేస్తూనే ఏళ్ల వేళల అందు బాటులో ఉన్నామని వారు గుర్తు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి : రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన నూతన వధూవరులు..
మండిపల్లి కుటుంబం మైనార్టీలను ఎప్పుడు కూడా విస్మరించలేదన్నారు. నేను కొన్ని వార్డులలో ఎన్నికల ప్రచారం కు వెళితే కొన్ని వార్డులలో వెలిగల్లు మంచి నీటి సరఫరా ఐదు నుండి పది రోజులు పడుతుందన్నట్లు తమ ఎదుట అవేదనను వ్యక్తం చేశారు. నేను ఎమ్మెల్యే గా గెలిస్తే ఇల్లు లేని వారికీ ఇల్లు, పెన్సన్ అందని వారికీ పెన్సన్ అన్ని కుడా మీ వార్డులల్లోకి వచ్చి ఇచ్చే బాధ్యత నాదేనన్నారు. మీరు వేసే ఓటు మీ భవిష్యత్తు తో మీ బిడ్డల భవిష్యత్తు గురించి అలోచించి ఒటువేయాలని వారు కోరారు. మీ బిడ్డ గా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపి గా సుగవాసి సుబ్రమణ్యం లకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే మీకందరికీ అందుబాటులో ఉండి రాయచోటి ని అభివృద్ధి చేస్తానని ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సలర్లు, మైనార్టీ నాయకులూ, మైనార్టీ మహిళలు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.