Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home International మధ్యశ్రేణి బాలిస్టిక్​ మిస్సైల్​ ను విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా

మధ్యశ్రేణి బాలిస్టిక్​ మిస్సైల్​ ను విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా

by Satya
Ballistic Missile


తొలిసారిగా ఘన ఇంధన మధ్యశ్రేణి బాలిస్టిక్ మిస్సైల్​(Ballistic Missile) వాడకం..

మధ్యశ్రేణి హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ను డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా విజయవంతంగా పరీక్షించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ప్రయోగంలో ఉత్తర కొరియా(North Korea) కొత్త విధానాన్ని ఉపయోగించినట్లు తెలిపింది. తొలిసారిగా మధ్యశ్రేణి ఘన ఇంధన బాలిస్టిక్ మిస్సైల్​ ‘వాసోంగ్ఫో 16బీ(Wasongpho 16b)’ని ప్రయోగించినట్లు వార్తాసంస్థ వివరించింది.

101 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి..

ఇందులో తొలిసారిగా అభివృద్ధి చేసిన హైపర్ సోనిక్ గ్లైడింగ్ వార్ హెడ్(Hypersonic Gliding Warhead) ను కూడా వాడారని పేర్కొంది. దేశ రాజధాని పాంగ్ యాంగ్ శివార్లలోని సైనిక శిక్షణ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగినట్లు వార్తాసంస్థ తెలిపింది. ఈ ప్రయోగంలో భాగంగా మిసైల్ తొలి దశలో 101.1 కిలోమీటర్ల ఎత్తుకు, రెండో దశలో 72.3 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొని చివరకు వెయ్యి కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకుంది. ఆ తర్వాత అది నిర్దేశిత కచ్చితత్వంతో కొరియా ద్వీపకల్పంలోని సముద్రజలాల్లో పడిపోయింది.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) హర్షం వ్యక్తం..

క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశ సైనిక శాస్ర్త, సాంకేతిక పరిజ్ఞాన పురోగతిని చాటేందుకు ఇదో శక్తిమంతమైన, వ్యూహాత్మకమైన ఆయుధమని పేర్కొన్నారు. శత్రు దేశాలను నియంత్రించేందుకు అత్యంత శక్తిమంతమైన ఆయుధాలను తయారు చేయడం దేశం ముందున్న అతిపెద్ద బాధ్యతని చెప్పారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: Mumbai Vs Rajasthan IPL 2024 | ముంబై పై రాజస్థాన్ ఘన విజయం


అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్జీనియా రాష్ట్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి …
భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్‌..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె టిఫానీ ట్రంప్‌ ప్రస్తుతం భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. …
భారత మామిడిపండ్లపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం కలకలం రేపింది.
భారత మామిడిపండ్లపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం కలకలం రేపింది. భారతదేశానికి చెందిన అత్యంత ఆదరణ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019200
Total views : 90088

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.