ధర్మవరం NDA ఎన్నికల కార్యాలయం వద్ద ఈరోజు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (BJP Foundation Day Celebrations) ఘనంగా జరిగాయి. బీజేపీ జాతీయ కార్యదర్శి, NDA బలపరిచిన ధర్మవరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి శ్రీ సత్యకుమార్ యాదవ్ (Sri Satyakumar Yadhav)పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అశేష భారతీయ జనతాపార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు.
ఇది చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు..!
జాతీయవాద భావంతో, సైద్ధాంతిక నిబద్ధతతో, సేవానిరతితో ప్రజల మన్ననలు అందుకుంటూ, అప్రతిహత విజయాలు సాధిస్తూ ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతాపార్టీ అవతరించింది. పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా దేశాన్ని కూడా అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు. రాబోయే ఎన్నికల్లోనూ మళ్ళీ ప్రధానిగా గెలిచి, భారత్‌ను విశ్వగురువుగా నిలిపే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి అని అన్నారు..
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి