Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh శ్రీశైలంలో ఒళ్లు గగ్గురు పొడిచేలా వీరశైవుల విన్యాసాలు…

శ్రీశైలంలో ఒళ్లు గగ్గురు పొడిచేలా వీరశైవుల విన్యాసాలు…

by Prakash
Srisailam Devotees

శ్రీశైలంలో(Srisailam) ఒళ్లు గగ్గుర్లు పొడిసేలా వీరశైవుల విన్యాసాలు శరీర భాగాలలో శూలాలతో గుచ్చుకుని భక్తిని చాటిన కన్నడిగులు శివదీక్ష శిభిరాలలో అగ్నిగుండంలో నడిచిన కన్నడ భక్తులు.

Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నంద్యాల జిల్లా అపరభక్తికి మూలం వీరశైవుల విన్యాసాలు అగ్నిగుండ ప్రవేశం ఒళ్లు గగ్గుర్ పొడిచేలా అర్ధరాత్రి వరకు శ్రీశైలంలో సాగిన వీరాచార విన్యాసాలు వీరశైవుల శరీరాలపై ఇనుప సువ్వలతో గుచ్చుకుని వారి భక్తిని చాటుకున్నారు. వీరశైవుల విన్యాసాలు తిలకించిన లక్షలాదిమంది భక్తులు ఆచ్యర్యానికి గురియ్యారు ఇదంత ఎక్కడో కాదు సాక్ష్యాత్తు ఆ పరమశివుని సన్నిదిలోని శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సందర్భంగా కన్నడ భక్తులు(Srisailam Devotees) వారి శరీర భాగాలపై ఇనుప సువ్వలతో గుచ్చుకుని వారి భక్తి ప్రపత్తిని చాటుకున్నారు.

ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సంభరాలు అంభరాన్నంటాయి ఉగాది పర్వదినానికి ముందు రోజు రాత్రి వీరశైవుల అగ్నిగుండ ప్రవేశం ఉగాది ప్రధానమైన ఘట్టం తమ ఆడపడుచుగా ఆరాదించే భ్రమరాంబికాదేవి సన్నిదిలో కన్నడిగులు సర్వపాపాలు హరించాలన్న సంకల్పంతో మంగళవారం అమావాస్యనాడు రాత్రి అగ్నిగుండ ప్రవేశం చేశారు ఎంతో ఆద్యాత్మక భరితంగా సాగేన ఈ కార్యక్రమములో ముందుగా అగ్ని గుండానికి ఆలయ అర్చకులు, ఈవో పెద్దిరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు. అనంతరం వీరశైవులు తమవిన్యాసాలు ప్రదర్శించారు రాత్రి 11 గంటలకు శివదీక్షాశిభిరాలలో శరీర భాగాలలో నోటిలో బుగ్గలలో ఇనుప సువ్వలతొ గుచ్చుకుంటూ హరహర మహాదేవా అంటూ ఆ మల్లికార్జునస్వామికి వేడుకుకున్నారు.

వళ్లుగగ్గుర్లు పోడిచేలా భక్తి తన్మయంతో వీరశైవుల విన్యాసాలు…| Srisailam Devotees

నుదిటిపై కనుబొమ్మలపై చేతులపై గుచ్చుకుంటు వళ్లుగగ్గుర్లు పోడిచేలా ఇనుప సువ్వలను కన్నడిగుల తమ శరీరభాగాలలో గుచ్చుకుని భక్తి తన్మయంతో చేసిన నృత్యాలు ఆద్యత్మిక ఆకర్శనగా నిలిచాయి పూర్వం మల్లికార్జునస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు వీరశైవులు తమ శరీరభాగాలను అర్పించేవారని అందుకే శ్రీస్వామివారి గర్భాలయం ఎదురుగా వీరశిరోమండపాన్ని అప్పటి రాజులు నిర్మంచినట్లుగా చరిత్ర చేబుతుంది. ఈ క్రమములోనే నేటికి ఉగాది పర్వదినానికి ముందు రోజు అమావాస్యనాడు రాత్రి వీరాచార్య విన్యాసం అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలు శ్రీశైలం క్షేత్రంలో సాంప్రదాయ బద్దంగా జరుగుతున్నాయి అనంతరం వీరశైవ భక్తబృందాలు వీరాచార విన్యసాలతో అగ్నిగుండంలో నడుచుకుంటూ వారి మొక్కులను తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసులు అర్చకులు,సిబ్బంది పెద్దఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు.


అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు …
వైభవంగా గోదావరి పుష్కరాలు.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …
2027 గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.
2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని సీఎం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: