సీఎం జగన్(CM Jagan)పై రాయితో దాడి కేసులో నిందితుడు సతీశ్(Satish)కు కోర్టు 14 రోజలు పాటు రిమాండ్ విధించింది. విజయవాడ(Vijayawada) సింగ్ నగర్‌లో బస్సు యాత్ర(Bus Yatra) నిర్వహిస్తున్న సమయంలో సీఎం జగన్‌పై రాయితో దాడి జరిగింది. దీంతో పోలీసు(Police)లు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపి నిందితుడు సతీశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిందితుడు సతీశ్‌కు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇది చదవండి: ఏపీలో కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామా..!
అయితే నిందితుడు సతీశ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. సీఎం జగన్ పై నిందితుడు రెండు సార్లు రాయి విసిరినట్లు తెలిపారు. ఒక సారి మిస్ కావడంతో మరోసారి తగిలినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్‌పై దాడి చేయమని నిందితుడు సతీశ్‌కు దుర్గారావు అనే వ్యక్తి చెప్పినట్లు చెప్పారు. దాడి తర్వాత దుర్గారావుకు నిందితుడు సతీశ్ ఫోన్ చేశారని, మరోసారి చేస్తే స్విచ్చాఫ్ వచ్చిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
- ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి