చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కృష్ణా రెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలకు సంబంధించిన స్కూల్ బస్సు మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో దండపల్లి రూట్ నందు ఆగిపోయింది. ఏంటా అని ఆరా తీస్తే వాహనం డీజిల్ సప్లై కాలేదని డ్రైవర్ తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ఎక్కడబడితే అక్కడ ఆగిపోతున్న స్కూల్ బస్సు .ఒకవేళ అటవీ ప్రాంతంలో ఎక్కడైనా ఆగిపోతే పిల్లల పరిస్థితి ఏంటి అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రతి ఒక్క బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసే రోడ్డుపైకి వచ్చేటట్లు చేస్తున్నామని తెలిపినా ఇలాంటి ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యమా అధికారుల పర్యవేక్షణ లోపమా అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధించిన స్కూలుపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.