Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana ఎర్రబెల్లి దయాకర్‌రావు చేరికకు సీఎం రేవంత్‌ ఓకే చెప్పారా?

ఎర్రబెల్లి దయాకర్‌రావు చేరికకు సీఎం రేవంత్‌ ఓకే చెప్పారా?

by Satya
ఎర్రబెల్లి దయాకర్‌రావు చేరికకు సీఎం రేవంత్‌ ఓకే చెప్పారా?

బీఆర్‌ఎ్‌సను ఖాళీ చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గతాన్ని మరిచి అంగీకరించారా? ఎర్రబెల్లి దయాకర్‌రావు చేరికకు సీఎం రేవంత్‌ ఓకే చెప్పారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో టీడీపీలో కలిసి పని చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి మధ్య నోటుకు ఓటు కేసు సమయంలో విభేదాలు తలెత్తాయి. నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎర్రబెల్లి టీడీపీని వీడి బీఆర్‌ఎ్‌సలో చేరి, ఐదేళ్లు మంత్రిగా పని చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎర్రబెల్లి ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది. ఇక వరుస ఓటములతో బీఆర్‌ఎస్‌ కేడర్‌ నైరాశ్యంలో ఉండగా.. కీలక నేతలు తలోదారి చూసుకుంటున్నారు. కాంగ్రెస్‌ కూడా ఇదే అదనుగా బీఆర్‌ఎ్‌సలోని కీలక నేతలను చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది.

ఈ నేపథ్యంలో తొలుత ఇద్దరు మంత్రులతోపాటు ఐదారుగురు ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలోకి ఎర్రబెల్లిని తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరిపినా.. సీఎం రేవంత్‌ వ్యతిరేకించారని సమాచారం. ఇటీవల స్టేషన్‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరటమే కాకుండా తన కూతురు కడియం కావ్యను వరంగల్‌ ఎంపీగా గెలిపించుకున్నారు. కడియం పార్టీని వీడటంతో ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లాలో బీఆర్‌ఎ్‌సకు పెద్ద దిక్కుగా నిలిచారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

  • మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
    ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
  • వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
    వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్‌లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో…
  • పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
    సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
  • Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..
    పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా 6వ ఓటమి, దీంతో వారి సీజన్ పూర్తిగా తలకిందులైంది. ప్లేఆఫ్స్ రేస్ వేడెక్కుతున్న ఈ సమయంలో ఇది Chennai Super Kings, Kolkata Knight Riders, Rajasthan Royals మరియు బహుశా Delhi Capitals వంటి…
  • Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..
    ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించింది. అబిషేక్ పోరెల్ మరియు KL రాహుల్ తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో 72 పరుగులు వచ్చాయి, 10వ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 105/0 వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014542
Total views : 80442

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.